Viral Video: “స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ”.. డెలివరీబాయ్ ఏం చేశాడంటే..
- శ్మశానంలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ..
- వైరల్ అవుతున్న ఫుడ్ డెలివరీ వీడియో..
- డెలివరీ బాయ్‌ను భయపెట్టిన మహిళ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఒక మహిళ స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్మశానంలోకి ఫుడ్ ఆర్డర్ ఏంటా.? అని ఆందోళన చెందడం డెలివరీ బాయ్ వంతైంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇటీవల ఆన్లైల్లో కనిపిస్తున్న వీడియోలో, డెలివరీ ఏజెంట్ ఫోన్లో కస్టమర్‌తో మాట్లాడుతూ.. లొకేషన్ వైపు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే, మహిళ సమాధానం విన్న డెలివరీ బాయ్‌కి ఫ్యూజులు అవుటయ్యాయి.
మహిళ శ్మశానంలో ఉన్నట్లు డెలివరీ బాయ్‌కు అర్థం అవుతుంది. డెలివరీ ఏజెంట్ మహిళతో మాట్లాడుతూ.. ‘‘మేడమ్ నేను లొకేషన్లో ఉన్నాను. నేను ఇప్పుడు ఎక్కడి రావాలి..?’’ అని అడుగుతాడు. ఇందుకు ఆ మహిళ ‘‘ నేరుగా రండి, అక్కడ ఒక కుక్క కూర్చుని ఉండటం చూస్తారు’’ అని చెబుతుంది. దీనికి డెలివరీ బాయ్..‘‘మేడమ్ అది స్మశానవాటిక’’ అని చెబుతాడు. దీనికి మహిళ..‘‘కుక్కను చూశారు కదా? స్మశాన వాటిక గేటు లోపటికి రండి’’ అని అడుగుతుంది.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: Face Signals: మీ ముఖం మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతోంది.?
దీంతో షాక్ అయిన డెలివరీ బాయ్ ‘‘మీరు స్మశాన వాటిక నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారా.?.’’ అని అడుగుతూ, లోపలికి వెళ్లడానికి నిరాకరించి, గేట్ బయటకు వచ్చి ఆర్డర్ తీసుకోవాలని కోరుతాడు. దీనికి మహిళ స్పందిస్తూ.. ‘‘ భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను’’ అని చెబుతుంది. నవ్వుతూ.. ‘‘నీకు దయ్యాలు అంటే భయమా.?’’ అని అడుగుతుంది. దీనికి డెలివరీ ఏజెంట్ గేట్ బయటకు వచ్చి ఆర్డర్ తీసుకోకుంటే, క్యాన్సల్ చేస్తానని చెబుతాడు.
అయితే, స్మశాన వాటికలో ఉన్న మహిళ చాలా ప్రశాంతంగా ఎలాంటి భయం లేకుండా మాట్లాడటం చాలా మందిని భయపెడుతోది. ఇది డెలివరీ ఏజెంట్‌ను భయపెట్టడానికి చేసిన ఫ్రాంక్ వీడియోనా..? లేక ఆ మహిళ తన స్నేహితులతో స్మశానంలోనే ఉండా? అని అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా వ్యూస్ కోసం ఇలా చేశారా? అని చాలా మంది నెటిజన్లు అనుమానిస్తున్నారు.
🚨 STRANGER THINGS HAPPENING 🚨
–Viral Video shows woman Ordering Food at the Graveyard
Delivery Agent declines to Enter
— Seriously not funny woman why she will do that?? pic.twitter.com/FZePgFgv44— Gagan Choudhary (@choudhary_99415) February 1, 2026
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!