Woman drown: రిసార్ట్ స్మిమ్మింగ్‌ పూల్‌లో మునిగి యువతి మృతి.. రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా..

  • వీకెండ్ ఎంజాయ్ చేద్దామనుకుంటే, ఎదురైన విషాదం..
  • స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ముగ్గురు మహిళలు మృతి..
  • ఒకరిని రక్షించే క్రమంలో మునిగిన ముగ్గురు..
  • మంగళూర్‌లో ప్రైవేట్ బీచ్ రిసార్ట్‌లో ఘటన..
Woman Drown

Woman Drown

Woman drown: కర్ణాటక మంగళూర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్టుల్లో విషాదం నెలకొంది. వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకుంటే అనుకోని ఘటన ఎదురైంది. మైసూర్‌కి చెందిన ముగ్గురు మహిళలు ఆదివారం రిసార్టులోని స్మిమ్మింగ్ పూల్‌లో ముగినిపోయి మరణించారు. ప్రైవేట్ బీచ్ రిసార్టులో ఈ ఘటన జరిగింది. బాధితులను 21 ఏళ్ల నిషిత ఎండి, 20 ఏళ్ల పార్వతి ఎస్, 21 ఏళ్ల కీర్తనా ఎన్‌గా గుర్తించారు. వారు శనివారం (నవంబర్ 16) నుంచి మంగళూరులోని సోమేశ్వర ఉచ్చిలలోని ఓ ప్రైవేట్ బీచ్ రిసార్ట్‌లో ఉంటున్నారు.

Read Also: The Sabarmati Report: నిజం బయటపడుతోంది..గోద్రా విషాదంపై తెరకెక్కిన ‘‘ది సబర్మతి రిపోర్ట్’’పై ప్రధాని ప్రశంసలు..

×
×
Ad

పోలీసులు కథనం ప్రకారం.. ముగ్గురు యువతులు ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్మిమ్మింగ్ పూల్‌లోకి దిగి వీడియో రికార్డ్ చేయాలని అనుకన్నారు. పూల్‌లోకి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే ఒకరు మునిగిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు కూడా మునిగిపోయారని, ఇది కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురికి ఈత రాదని తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే ముగ్గురు కూడా ప్రమాదం నుంచి బయటపడేందుకు ఈత కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. ఉల్లాల్ పోలీస్ స్టేషన్ నుండి ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఎన్ బాలకృష్ణ నేతృత్వంలోని బృందం రిసార్ట్‌కు చేరుకుంది మరియు తదుపరి విచారణ కొనసాగుతోంది.