Site icon NTV Telugu

Shashi Tharoor: ఉగ్రవాదం ప్రపంచానికి అతి పెద్ద సమస్య.. పాక్పై శశిథరూర్ ఫైర్!

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor: ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్‌ను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది. ఈ క్రమంలోనే న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్‌ను టీమ్ సందర్శించింది. ఈ సందర్భంగా ఎంపీ శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని కోరారు.

Read Also: Cyber Den: కాల్ సెంటర్ ముగుసుగులో భారీగా ఆర్థికమోసాలు.. అమెజాన్ కస్టమర్లే లక్ష్యంగా..?!

అయితే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ తీసుకొన్న చర్యలను ఎంపీ శశిథరూర్ భారత కాన్సులేట్‌లో చెప్పుకొచ్చారు. పహల్గాంలో మతం ఆధారంగా టూరిస్టులపై ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. ఈ దాడితో భారత్‌లో మతపరమైన అల్లర్లు సృష్టించాలని వారు ప్రయత్నించారు.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడిందన్నారు. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ఇది. దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని ఇండియా ఇప్పటికే ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించింది.. నేను ప్రభుత్వంలో కాకుండా.. ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను.. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత బలగాలు తెలివితో దెబ్బ తీశాయని శశిథరూర్ వెల్లడించారు.

Read Also: Asaduddin Owaisi: పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం!

ఇక, పాక్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేసి.. వాటిని నేలమట్టం చేశాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. మేము టెర్రర్ స్పాట్స్ పై దాడి చేస్తే.. పాక్‌ సైన్యం రియాక్ట్ అయింది.. మాపై ప్రతి దాడులకు దిగింది. వాటిని సమర్థమంతంగా తిప్పికొట్టామని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌తో ఉగ్ర చర్యలను భారత్ సహించదనే గట్టి మెస్సేజ్ ఇచ్చిందన్నారు. ఇది పహల్గాం దాడికి ప్రతిస్పందన మాత్రమే తప్ప.. పాక్‌తో యుద్ధం చేయాలనేది మా ఉద్దేశం కాదని శశిథరూర్‌ తెలిపారు.

Exit mobile version