Site icon NTV Telugu

Indian Army On POK: కేంద్రం ఆదేశాలు ఇవ్వడం ఆలస్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం

Indian Army On Pok

Indian Army On Pok

Will carry out any order given by Centre, says Army commander on taking back PoK: కేంద్ర ఇచ్చే ఏ ఆదేశాలనైనా అమలు చేస్తామని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు భారత ప్రభుత్వం ఇచ్చే ఏ ఉత్తర్వులనైనా అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉపేంద్ర ద్వివేది మంగళవారం అన్నారు. భారత సైన్యానికి సంబంధించినంత వరకు భారత ప్రభుత్వం ఇచ్చే ఏ ఉత్తర్వులనైనా అమలు చేస్తుందని.. ఎటువంటి ఆదేశాలకు ఎప్పుడు ఇచ్చినా.. మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని ఆయన అన్నారు.

Read Also: Lancet Study: ఈ 5 బ్యాక్టీరియాలు భారతీయుల మరణాలకు కారణం అవుతున్నాయి.

భారత్, పాకిస్తాన్ ఇరు దేశాల ప్రయోజనాల దృష్ట్యా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయకుండా చూసుకోవాల్సి బాధ్యత సైన్యంపై ఉందని, అయితే ఎప్పుడైనా కాల్పులు జరిగితే..పాకిస్తాన్ కు తగిన సమాధానం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. దేశంలో 50 శాతం మంది 25 ఏళ్ల లోపే ఉన్నారని.. వారిని అగ్నివీరులుగా తీసుకుని వారి సేవలను పొందుతామని.. తర్వాత కొంత మందిని పారామిలిటరీ, ఇతర పోలీసు బలగాల్లోకి చేర్చుకుంటారని.. మరికొంతమంది స్వయం ఉపాధి పొందుతారని ఆయన అన్నారు.

గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) భాగాలను తిరిగి తీసుకుంటామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించిన వారాల తర్వాత ద్వివేది ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్ సైన్యం పీఓకే ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. పీఓకేలో కాశ్మీరీల బాధను మేము అనుభవిస్తున్నాము.. మేము కాశ్మీర్ అభివృద్ధి ప్రారంభించామని.. మేము గల్గిత్ బాల్టిస్తాన్ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు. కాశ్మీరియత్ పేరుతో పాకిస్తాన్, భారత్ పైకి ఉగ్రవాదులను ఎగదోస్తుందని.. ఉగ్రవాదానికి మతం లేదని..ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం భారతదేశమే అని ఆయన అన్నారు.

Exit mobile version