Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరైనా వారికి మద్దతు ఇస్తా.. ఠాక్రే సంచలన వ్యాఖ్యలు..
- ముంచుకొస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..
- సీఎం అభ్యర్థి ఎవరైనా మద్దతు ఇస్తా..
- ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తుల్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే శివసేన( యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్) ఏ అభ్యర్థిని ప్రకటించిన తాము మద్దతు ఇస్తామని చెప్పారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంవీఏ కూటమి కార్యకర్తల సమావేశంలో ఠాక్రే చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
READ ALSO: Jammu Kashmir Elections: 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
గతంలో ఎంవీఏ కూటమి తరుపున ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, శివసేనలో తిరుగుబాటు కారణంగా ఆయన పదవీ కోల్పోయారు. బీజేపీ సాయంతో ఏక్నాథ్ షిండే ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘కూటమిలో ఏ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించినా మద్దతు ఇస్తా. నేను నా కోసం పోరాడుతున్నాను. మహరాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాను’’ అని అన్నారు.
ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ లాజిక్‌తో కాకుండా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించాలని చెప్పారు. ఎంవీఏ క్యాడర్ స్వప్రయోజనాల కన్నా మహారాష్ట్ర గర్వాన్ని, ప్రయోజనాలను కాపాడటం కోసం పోరాడాలని ఠాక్రే అన్నారు. ఇదిలా ఉంటే, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘‘ లౌకిక సివిల్ కోడ్’’ వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఆయన తన హిందుత్వను వదులుకున్నారా..? అని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడుతూ, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఈ బిల్లును ఎందుకు ఆమోదింపచేయలేదు అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!