ప్రధాని కోసం మృత్యుంజయ హోమాలు.. బీజేపీ పిలుపు

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటన పెద్ద రచ్చగా మారింది.. రైతుల ఆందోళనతో మార్గమధ్యలో ఇరుక్కుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు.. ఈ ఘటనలో పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి.. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని భద్రత పట్ట నిర్లక్ష్యంగా వ్యవహరించారని పంజాబ్‌లోని కాంగ్రెస్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తోంది బీజేపీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంజాబ్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేస్తుండగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది..

Read Also: కరోనా ఎఫెక్ట్.. సంపూర్ణ లాక్‌డౌన్..

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు.. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని మృత్యుంజయ హోమం నిర్వహించేందుకు సిద్ధమైంది.. మండల, జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు.. బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్.. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో బండి సంజయ్ పాల్గొననున్నారు.. మరోవైపు, పంజాబ్ ఘటనను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.

Related Articles

Latest Articles