Mumbai Boat Tragedy: అరేబియా సముద్రంలో ఫెర్రీని, నేవీ బోటు ఢీకొనడంతో 14 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్‌కు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని ముంబైలోని కొలబా పోలీసులు ఇండియన్ నేవీ, మహారాష్ట్ర మారిటైం బోర్డుకు లేటర్ రాశారు. సముద్ర మార్గంలో అత్యంత రద్దీగా ఉన్న సమయంలో ట్రయల్ రన్‌కు ఎవరు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. ట్రయల్ నిర్వహణలో పాటించిన ప్రొటోకాల్‌ను పరిశీలిస్తున్నారు. కాగా, నౌకాదళ పడవలో థొరెటల్ సమస్య ఉంది.. దీంతో అది నియంత్రణ కోల్పోయి.. ప్రయాణికుల పడవను ఢీకొట్టిందని పోలీసుల ప్రైమరీ విచారణలో తేలింది. మరోవైపు, ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నౌకాదళం బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని కూడా నియమించింది. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి బోట్ రైడ్ చేసేవాళ్లు లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
Read Also: Bachhala Malli Review: బచ్చల మల్లి రివ్యూ
కాగా, గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్ కు నీల్‌కమల్ అనే ఫెర్రీ పడవ.. దాదాపు 100 మందికి పైగా టూరిస్టులతో వెళ్తుంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన నేవీకి చెందిన ఓ స్పీడ్ బోటు ఫెర్రీ బోటును ఢీకొట్టడంతో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో రెండు నౌకల్లో ఉన్న మొత్తం 113మందిలో 98 మందిని రక్షించగా.. మిగిలిన 15 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. దీంట్లో 14 మంది మరణించగా.. మరో ఏడేళ్ల బాలుడి కోసం రెస్య్కూ టీమ్ గాలింపు చర్యలు కొనసాగిస్తుంది.