NTV Telugu Site icon

Delhi: కేంద్రానికి ఆప్ లేఖ.. కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని వినతి

Kejriwal

Kejriwal

కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని కోరింది. దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండబోదని ఆశిస్తున్నట్లు ఆప్ పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి చేరిన రెండ్రోజులకు కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు అందజేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా నమ్మకస్థురాలైన అతిషికి అప్పగించారు. శనివారమే ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Karnataka: శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేసిన 15 రోజుల్లోగా కేజ్రీవాల్ అధికారిక సీఎం నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.  కేజ్రీవాల్‌.. ఆప్ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో కేజ్రీవాల్‌కు కేంద్రం వసతి కల్పించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రానికి లేఖ రాసింది. కేజ్రీవాల్ అధికారిక నివాసం-6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లా నుంచి భద్రతతో సహా అన్ని ప్రభుత్వ సౌకర్యాలను వదులుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: IPhone 16 First Customer: తెల్లవారుజామున 4:30 నుంచే క్యూలో.. ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌కు కేంద్రం వసతి కల్పించాలని పార్టీ డిమాండ్ చేస్తుందని.. దీని కోసం న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం లేదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌కు ఆస్తి, సొంత ఇల్లు కూడా లేవని తెలిపారు. ఒక జాతీయ పార్టీ కన్వీనర్‌గా ప్రభుత్వ వసతికి అర్హుడని, కేంద్రం వెంటనే కల్పించాలని కోరారు. కేజ్రీవాల్ మంగళవారమే రాజీనామా చేసి.. అతిషిని వారసుడిగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్..

Show comments