NTV Telugu Site icon

Puja Khedkar: పూజా ఖేద్కర్ మిస్సింగ్.. 5 రోజులుగా తెలియని జాడ!

Pujakhedkerias

Pujakhedkerias

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ జాడ గత ఐదు రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంట్లోనూ లేదు.. ఫోన్లు కూడా పని చేయడం లేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. వికలాంగుల కోటాను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో పూజాను జూలై 23 లోపు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ శిక్షణా కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్టు చేయలేదు. గడువు మంగళవారంతో ముగిసింది. పైగా యూపీఎస్సీ ఫిర్యాదుతో ఢిల్లీలో కేసు కూడా నమోదైంది. ఇంకోవైపు పూణె కలెక్టర్ వేధిస్తున్నారంటూ పూజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కూడా ఆమె వాంగ్మూలం తీసుకునేందుకు పూణె పోలీసులు ప్రయత్నిస్తుంటే.. దీనికి రెస్పాన్స్ లేదు. గత ఐదు రోజుల నుంచి పూజా ఆచూకీ లభించడం లేదని పోలీసులు చెప్పారు.

ఇది కూడా చదవండి: Olympics 2024: వామ్మో.. ఒలంపిక్స్ కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతోందా..?

మరోవైపు పూజా తల్లిదండ్రులు మనోరమా, దిలీప్ వైవాహిక స్థితిపై కేంద్రం ఆరా తీసింది. వారు కలిసి ఉన్నారా? లేదా విడిపోయారా? దీనిపై క్లారిటీ ఇవ్వాలని పూణె పోలీసులకు కేంద్రం ఆదేశించింది. ఈ వ్యవహారంపై వివరాలు సేకరించేందుకు కూడా పూజా ఖేద్కర్ అందుబాటులోకి రాలేదు. ఇంటర్వ్యూలో ఆమె.. తల్లిదండ్రులు విడిపోయారని పూజా పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పేరెంట్స్ వైవాహిక స్థితి తెలుసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

ఇది కూడా చదవండి: Bengaluru: అర్ధరాత్రి హస్టల్‌లోకి చొరబడి, యువతి గొంతు కోసి హత్య..

పూజా.. అతిగా ఊహించుకుని లేనిపోని కష్టాలు తెచ్చుకుంది. ట్రైనీ ఐఏఎస్‌కు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ ఆమె పూణె కలెక్టరేట్‌లో వసతులు కల్పించాలని సిబ్బందిని బెదిరించింది. దీంతో పూణె కలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో వాషిమ్‌‌కి బదిలీ చేశారు. అనంతరం రోజుకో ఆరోపణ రావడంతో వివాదాలు చుట్టుముట్టాయి. చదువు దగ్గర నుంచి క్యాష్ట్ సర్టిఫికెట్ వరకు… రేషన్ కార్డు దగ్గర నుంచి వికలాంగ సర్టిఫికెట్ వరకు అన్ని తప్పుడు పత్రాలను సృష్టించి పూజా ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇలా ఒకేసారి అన్ని ఆరోపణలు రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా యూపీఎస్సీ అప్రమత్తం అయ్యాయి. దర్యాప్తునకు ఆదేశించాయి. అంతేకాకుండా ఆమె శిక్షణ కాలాన్ని కూడా ఆపేశాయి. ఇంకోవైపు దర్యాప్తు సాగుతోంది. ఆమెకు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆస్పత్రులు కూడా సరిగ్గా స్పందించడం లేదని తెలుస్తోంది. ఇక విచారణలో ఆరోపణలు రుజువైతే పూర్తిగా ఆమె ఐఏఎస్ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Simbaa : జగపతిబాబు, అనసూయల ‘సింబా’ ట్రైలర్ టాక్..!

Show comments