Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ ప్రధానమంత్రిని సంయుక్తంగా ప్రకటిస్తామని ఈ రోజు చెప్పారు. 2004లో ఇండియా షైనింగ్ అని నినదించిన బీజేపీకి 2024లో కూడా అదే గతి పడుతుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి, వాటిని రక్షించే వారికి మధ్య జరుగున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దేశంలోని మెజారిటీ ప్రజల కోసం పనిచేస్తామని, భారత్ అనేది ఒకరు, ఇద్దరికి చెందినది కాదని ఆయన అన్నారు. మనదేశం గుత్తాధిపత్యం ఉన్న దేశం కాదని, వ్యాపారంలో సరసమైన పోటీ ఉన్న దేశమని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే ప్రశ్నకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సైద్ధాంతిక ఎన్నికల్లో పోరాడాలని ఇండియా కూటమి నిర్ణయించిందని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఎవరు ప్రధాని అనేది, మొత్తం అన్ని పార్టీలు కలిసి సంయుక్తంగా నిర్ణయిస్తాయని చెప్పారు. మీడియా చెబుతున్నట్లు దాని కంటే ఇది చాలా దగ్గరి పోటీ కలిగిన ఎన్నికలని ఆయన అన్నారు.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
Read Also: Hema Malini: బీజేపీ మధుర అభ్యర్థి హేమమాలిని ఆస్తులెంతో తెలుసా..?
2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇండియా షైనింగ్ అనే ప్రచారం జరిగిందని, ఆ సమయంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందని గుర్తు చేశారు. ఆనాటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు దానికి భిన్నమైనవని అన్నారు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను నిలిపేశారని, ఇప్పుడు ప్రజలతో వెళ్లడమే తమకు మిగిలిందని చెప్పారు. ‘న్యాయ్ పాత్ర’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో విడుదల చేశారు. ఇది ఐదు ‘పిల్లర్స్ ఆఫ్ జస్టిస్’ మరియు వాటి క్రింద 25 హామీలపై దృష్టి పెట్టింది.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!