Site icon NTV Telugu

PM Modi Warns Pak: మన డ్రోన్లు, మిస్సైల్స్ పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయి..

Modi

Modi

PM Modi Warns Pak: ఆదంపుర్‌లో భారత సైనికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఉగ్రవాదం అంతం చూస్తామంటూ భారత సైన్యం శపథం చేసింది.. మన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయని అన్నారు. భారత స్వాభిమానాన్ని కొత్త శిఖరాలకు చేర్చాం.. శత్రువుకు మన దాడి గురించి కనీసం తెలియలేదు అని పేర్కొన్నారు. కానీ, పాకిస్తాన్ మాత్రం పౌర విమానాలను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడిందని ఆరోపించారు. మీరు (ఇండియన్ ఆర్మీ) ఎంతో నైపుణ్యంతో మీ లక్ష్యాలను ఛేదించారని కొనియాడారు ప్రధాని మంత్రి మోడీ.

Read Also: Traffic Restrictions: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

ఇక, భారతీయ పౌరులకు ఎలాంటి నష్టం లేకుండ శత్రువును చావుదెబ్బ కొట్టారు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మన దేశంలోని అనేక ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ టార్గెట్ చేసింది.. కానీ, మన రక్షణ వ్యవస్థ వల్ల పాకిస్తాన్ దాడులన్నీ నిర్వీర్యమైపోయాయి అని తెలిపారు. పాక్ డ్రోన్లు, యూఏవీలు, ఎయిర్ క్రాఫ్ట్ లు.. మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేపోయాయి అని చెప్పుకొచ్చారు. మళ్లీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానమిస్తుంది.. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ సమయాల్లో నిరూపించాం.. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తోనూ స్పష్టం చేశామని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు.

Exit mobile version