Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు… దేశ, విదేశాల నుంచి మోడీకి శుభాకాంక్షల వెల్లువ

* హైదరాబాద్‌: నేడు ఎన్టీఆర్‌ స్టేడియంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌..

* ఉదయం 7 గంటలకు బీజేపీ ఆఫీసులో బండి సంజయ్‌ జెండా ఆవిష్కరణ..

* ఉదయం 8.40కి పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచన వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా

* ఉదయం 9 గంటలకు టీఆర్ఎస్‌ ఆఫీసులో కేశవరావు జెండా ఆవిష్కరణ

* ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు సమైక్య దినం జెండా ఆవిష్కరణ సభలు

* తెలంగాణ జాతీయ సమైక్యతా దినం పురస్కరించుకుని ఉదయం 8.45 గంటలకు డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు

* నేడు ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లనున్న అమిత్ షా.. ఇవాళ మధ్యాహ్నం మోడీ జన్మ దిన కార్యక్రమం లో పాల్గొన్న తర్వాత ఈటల ఇంటికి వెళ్లనున్న అమిత్ షా

* ఉదయం 9.30కి గాంధీ భవన్‌లో జరిగే వేడుకల్లో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి, ముఖ్య నేతలు

* 9.30 గంటలకు లెఫ్ట్‌ పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ

* ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి సీపీఎం ర్యాలీ

* ఉదయం 10.30కి పబ్లిక్‌ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్‌ సమైక్య దినోత్సవ వేడుకలు

* ఉదయం 11.20కి హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమావేశం

* మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్‌లో గిరిజన భవన్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

* మధ్యాహ్నం నెక్లెస్‌ రోడ్‌ నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు సాంస్కృతిక ర్యాలీ

* మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో సీపీఐ బహిరంగ సభ

* మధ్యాహ్నం 3.20 గంటలకు నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో అమిత్‌షా కార్యక్రమం

* ఇవాళ సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సెలవు..

* విశాఖ: నేడు భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్.. ఆల్ ఎబిలిటీస్ పార్క్ దగ్గర బీచ్ క్లీనింగ్ లో పాల్గొననున్న సోము వీర్రాజు, సునీల్ థియోధర్, ఇతర ముఖ్యులు.

* బాపట్ల జిల్లా నేడు 6వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర.. ఐలవరం నుండి ప్రారంభమవనున్న రైతుల పాదయాత్ర.. కనగాల, రాజోలు, తూర్పు పాలెం మీదుగా నగరం వరకు కొనసాగుతున్న రాజధాని రైతుల పాదయాత్ర.

* అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: నేటి నుండి కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ రీత్యా రూ.50 దర్శనము లఘ దర్శనముగా ఏర్పాటు.. సిఫార్సు లేఖపై ప్రత్యేక దర్శనం రూ. 200 అమలు

* తిరుమల: ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. 20వ తేదీకి సంబంధించిన 15 వేల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

Exit mobile version