* ఉజ్బెకిస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. నేడు ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొననున్న మోడీ..
* నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. నేషనల్ పోలీస్ అకాడమీలో బస, రేపు పరేడ్‌గ్రౌండ్స్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొననున్న షా, అనంతరం టూరిజం ప్లాజాలో బీజేపీ కోర్ కమిటీ భేటీ.. రేపు మధ్యాహ్నం 2.30కి క్లాసిక్ గార్డెన్స్‌కు అమిత్ షా
* నేటి నుంచి తెలంగాణలో జాతీయ సమైక్యత ఉత్సవాలు.. మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ సమైక్యత ఉత్సవాలు.. రేపు ఉదయం 10.30కి పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు
* నేడు హైదరాబాద్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న రాజ్‌నాథ్.. మధ్యాహ్నం 2.40 గంటలకు కృష్ణంరాజు కుటుంబానికి పరామర్శ, మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొననున్న రాజ్‌నాథ్.. సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం
* నేడు నమీబియా నుంచి భారత్‌కు రానున్న 8 చిరుతలు.. భారత్‌లో అంతరించిపోయిన అడవి చిరుతలను రేపు కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేయనున్న ప్రధాని మోడీ
* విశాఖ: నేడు జాతీయ స్థాయి విద్యుత్ నియంత్రణ మండళ్ల సమావేశం, విద్యుత్ సంస్కరణలు, భవిష్యత్ అవసరాలు, వినియోగంపై సమీక్ష, పాల్గొననున్న వివిధ రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్‌లు
* శ్రీకాకుళం : నేడు భావనపాడు పోర్ట్ ప్రభావిత గ్రామాలలో పర్యటించనున్న అఖిలపక్ష పార్టీలు.
* గుంటూరు: నేడు రాజధాని రైతుల ఐదోరోజు మహాపాదయాత్ర.. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కొల్లూరు నుంచి బట్టిప్రోలు వరకు సాగనున్న పాదయాత్ర.
* విజయవాడ: నిర్వహణ పనులు దృష్ట్యా నేటి నుంచి 20 వ తేదీ వరకు పలు రైళ్ళను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే కాకినాడ – విజయవాడ, విజయవాడ – గుంటూరు, తెనాలి – విజయవాడ ప్యాసింజర్ రైళ్లు రద్దు
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైను… శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,634 మంది భక్తులు… తలనీలాలు సమర్పించిన 31,419 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ. 4 కోట్లు
* నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల వేములవాడలో వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. దుబ్బాకలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి