Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు ఒకే వేదికపై నరేంద్ర మోడీ, పుతిన్‌, జిన్‌పింగ్.. ఉజ్బెకిస్థాన్‌లో ఎస్‌సీవో అగ్రనేత లభేటీ.. రెండేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు.. హాజరుకానున్న పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

* నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయసభలు.. ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న సమావేశాలు

* నేడు మూడు రాజధానులపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ.. పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ

* నేడు బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ.. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా బైక్‌ ర్యాలీ.. చార్మినార్‌ నుంచి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం వరకు సాగనున్న ర్యాలీ

* మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్న వైఎస్‌ షర్మిల దీక్ష.. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తిచేయాలని డిమాండ్

* నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందంటున్న వాతావరణశాఖ

* తెలుగు ఫిలిం ఛాంబర్‌తో తెలుగు ఫిలిం ఫెడరేషన్‌ చర్చలు సఫలం.. వేతనాల పెంపుపై నేడు నిర్మాతల మండలి నుంచి అధికారిక ప్రకటన.

* గుంటూరు జిల్లా నేడు నాలుగో రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర… పెదరావూరు నుండి వేమూరు మీదుగా కొల్లూరు వరకు సాగనున్న రైతుల పాదయాత్ర..

* అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం రాజధాని గ్రామాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ. నేడు తుళ్లూరు మండలం నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను ,రాయపూడి ,గ్రామాల తో పాటు మంగళగిరి మండలం నీరుకొండ, కురగల్లు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్న అధికారులు.

* నేటితో ముగియనున్న కాకినాడ నగర పాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం.. రేపటి నుంచి కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్న కలెక్టర్ కృతికా శుక్లా

* నంద్యాల: నేడు ఆళ్లగడ్డలో ఉచిత కంటి వైద్య శిబిరం.

Exit mobile version