Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* ఫిఫా వరల్డ్‌కప్‌లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు స్విట్జర్లాండ్‌తో కెమెరూన్‌ ఢీ.. సాయంత్రం 6.30 గంటలకు ఉరుగ్వేతో సౌత్‌ కొరియా మ్యాచ్‌, రాత్రి 9.30 గంటలకు పోర్చుగల్‌తో తలపడనున్న ఘానా

* తిరుమల: నేడు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు డిసెంబర్‌ నెల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

* బాపట్ల: అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.

* ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి విడదల రజని

* గుంటూరు: నేటి నుంచి మూడు రోజులపాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు… కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి ఆర్కే రోజా.

* పల్నాడు: నేడు కారంపూడిలో రెండవ రోజు పలనాటి వీర ఆరాధన ఉత్సవాలు.. నేడు రాయబారం కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఉత్సవ కమిటీ..

* పల్నాటి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29 వరకు కారంపూడిలో జాతీయస్థాయి ఎడ్ల పోటీలు…

* తిరుమల: ఇవాళ లక్ష్మి కాసుల హారం ఉరేగింపు.. తిరుచానురు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మికాసుల హారం ఉరేగింపు.. రాత్రి గజవాహన సేవలో అమ్మవారికి కాసుల హారని అలంకరించనున్న అర్చకులు

* తిరుమల: రేపు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ మాసానికి సంబంధించిన టోకేన్లు విడుదల చేయనున్న టీటీడీ

* తూర్పుగోదావరి జిల్లా : నేడు కార్తీక మాసం ఆఖరి రోజు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నా స్నానఘట్టాలు.. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. భక్తుల పుణ్య స్నానాలతో రాజమండ్రిలో కిక్కిరిసిన పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు, స్నానాలు ఆచరించి గోదావరి నదిలో 365 ఒత్తులతో కార్తీక దీపాలు వదులుతున్న భక్తులు.

* గోదావరి నదిలో స్నానాలు ఆచరించి ఉపవాస దీక్ష చేపడుతున్న మహిళలు, భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగుతున్న స్నాన ఘట్టాలు.. శివాలయాల్లో పరమేశ్వరుడి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

* సింహాద్రి అప్పన్న వరాహ పుష్కరిణికి భారీగా తరలివచ్చిన భక్తులు.. పోలిపాడ్యమి నాడు పుష్కరిణిలో దీపాలు వొదలడానికి భారీగా చేరుకున్న మహిళ భక్తులు.. చెరువు గట్టుపై ప్రత్యేకపూజలు.. భక్తులకు భారీగా ఏర్పాట్లు చేసిన సింహాచలం సింహాచలం దేవస్థానం..

* నెల్లూరు జిల్లా: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలం లోని కనుపూర్ కెనాల్ కింద పరిధిలోని చెరువులను పరిశీలిస్తారు అనంతరం పొదలకూరులో జరిగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు

* అనంతపురం : గుంతకల్లు ఆర్టీసీ డిపోలో నూతన ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించనున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ .

* అమరావతి: నేడు తాడేపల్లి మండలం ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ.. నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందటంపై గతంలో పిటిషనర్లపైన అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. 14మంది పిటిషనర్లు హాజరుకావాలని హైకోర్టు ఆదేశం.

* విశాఖ: నేటి నుంచి ఉత్తరాంధ్రుల ఇలవేల్పు బురుజుపేట కనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు .. కనకమహాలక్ష్మి దేవస్థానంలో . అమ్మవారికి తొలి అభిషేకం చేయనున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి

* నేడు నెల్లూరు జిల్లా కోర్టులో దొంగతనం కేసుపై హైకోర్టులో వెలువడనున్న తీర్పు.. కోర్టులో దొంగతనం కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. మంత్రి‌ కాకాని‌ గోవర్దనరెడ్డి తనపై తప్పుడు డాక్యుమెంట్లతో ఆరోపణలు చేశాడని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.

* అనంతపురం : బ్రహ్మసముద్రం మండల పరిధిలోని చలిమేపల్లి గొల్లలదొడ్డి,గోవిందయ్యదొడ్డి గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .

* విజయనగరం: నేడు తాటిపూడి రిసార్ట్ లో జనసేనా పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం.. ముఖ్య నాయకులతో‌ సమావేశం కానున్న పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్..

* విజయనగరం: పోలి పాడ్యమి, కార్తీక మాస చివరి రోజు కావడంతో దీపారాధన కోసం నదీ ఘాట్ల వద్ద భక్తులు.. బొబ్బిలి మండలం పెంట గ్రామం సమీపంలో వేగావతి నదిలో దీపారాధన చేస్తున్న భక్తులు, రద్దీగా మారిన శివాలయాలు..

* నంద్యాల: నేడు నందికొట్కూరుకు చేరుకోనున్న శ్రీశైలం పీఠాధిపతి శ్రీ చెన్న సిద్దరామపండితారాధ్య శివాచార్య స్వామిజి పాదయాత్ర..

Exit mobile version