Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు చంద్రగ్రహణం.. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుందంటున్న జ్యోతిష్య నిపుణులు

* తిరుమ‌ల‌: నేడు శ్రీవారి ఆలయం మూసివేత.. చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూత, బ్రేక్ ద‌ర్శనాలు రద్దు, ఇవాళ ఉద‌యం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌యం మూసివేత

* అనంతపురం : గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయం మూసివేత.

* సత్యసాయి జిల్లా : చంద్రగ్రహణం కారణంగా కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత

* ప్రకాశం : చంద్ర గ్రహణం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు మూత.. గ్రహణం విడిచిన అనంతరం సంప్రోక్షణ పూర్తి చేసి తిరిగి ఆలయాలు తెరవనున్న అర్చకులు..

* తూర్పుగోదావరి జిల్లా : నేడు చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని అన్ని దేవాలయాలు మూసివేత.. ఉదయం 8 గంటలకు మూసివేసి తిరిగి బుధవారం తెల్లవారు జామున ఆలయ సంప్రోక్షణ చేసి ఉదయం తెరుస్తారు, భక్తులు ఆలయ మూసివేత సమయాలను గమనించాలని దేవాదాయ శాఖ అధికారులు విజ్ఞప్తి

* ఏలూరు: చంద్రగ్రహణం కారణంగా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం మూసివేత, నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు..

* ఇంద్రకీలాద్రి: చంద్ర గ్రహణం సందర్భంగా మూత పడనున్న ఇంద్రకీలాద్రి… తిరిగి రేపు సంప్రోక్షణ అనంతరం తెరుచుకోనున్న ఇంద్రకీలాద్రి… ఇవాళ ఉదయం 8 గంటల నుండి రేపటి వరకు అన్ని దర్శనాలు రద్దు…

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలంలోని శివాలయాన్ని సందర్శిస్తారు అనంతరం కాకుటూరులో జైన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సాయంత్రం మనుబోలు లో జరిగే వేపకడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు

* గుంటూరు: నేడు, రేపు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు.. నేడు పెదకాకాని మండలం నంబూరు గుంటూరు మండలం బుడంపాడులో పర్యటించనున్న ఎస్టీ కమిషన్ చైర్మన్.

* గుంటూరు: చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల మూసివేత…

* అనంతపురం : చంద్రగ్రహణం కారణంగా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం మూసివేత.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయం మూసివేత.

* తిరుపతి: నేడు పద్మావతి మహిళా వర్శిటీ పాలక మండలి సమావేశం

* రాజన్నసిరిసిల్ల జిల్లా: చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు అధికారులు.. ఉదయం సుప్రభాత సేవ ప్రాత కాల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు, గ్రహణం అనంతరం 6:30 నిమిషాలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరనున్న ఆలయ అర్చకులు.. 8 గంటల నుండి భక్తుల దర్శనానికి అనుమతి

Exit mobile version