NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం అలెర్ట్.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌.. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

* నేడు ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. కారుమంచిలో పర్యటించనున్న సీఎం జగన్‌

* నేడు, రేపు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షలు.. రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షలు

* ఏపీ: నేడు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలవనున్న సీఎం వైఎస్‌ జగన్‌..

* నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ కవిత పిటిషన్‌.. ఇప్పటికే కవిత పిటిషన్‌పై కేబియట్‌ దాఖలు చేసిన ఈడీ

* ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ.. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నారని, ఆయన్ను మార్చాలని పిటిషన్.

* నేడు నూతన పారిశ్రామిక విధానం ప్రకటించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 2023-2027 ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ విడుదల చేయనున్న మంత్రి అమర్నాథ్‌

* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, నారాయణ ఖేడ్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

* తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,840.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850

* తిరుమల: నేడు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

* కాకినాడ: నేడు అన్నవరం సత్యదేవుని ఆలయంలో డయల్ యువర్ ఈ వో కార్యక్రమం.. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 08868 238127 నెంబర్ కి కాల్ చేసి భక్తులు సమస్యలు చెప్పే అవకాశం

* నేడు అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం.. దేవస్థానం బడ్జెట్, ఏప్రిల్ 30 నుంచి జరగనున్న స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు పై చర్చించనున్న సభ్యులు

* విశాఖ: కరోనా కేసులపై ఆరోగ్య శాఖ అలెర్ట్.. నేటి నుంచి విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాపిడ్ టెస్టులు.. PHCలు, CHCల్లో రోజూ 50 చొప్పున పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ..