Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

నేడు భారత్‌-శ్రీలంక మధ్య రెండో టీ20.. రాత్రి 7 గంటలకు పుణె వేదికగా ప్రారంభంకానున్న మ్యాచ్‌.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్

* ఢిల్లీలో నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో సదస్సు..

* నేడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ.. వైఎస్‌ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్‌

* నేడు యలమంచిలికి సీఎం వైఎస్‌ జగన్.. ఆడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం

* నేడు సిద్దపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్‌రావు

* తెలంగాణలో పోలీసులకు హెల్త్‌ప్రొఫైల్‌ క్యాంప్.. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లా ఎంపిక.. సిద్దిపేటలో నేడు ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు

* నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్.. కేంద్ర కేబినెట్‌ ఆధ్వర్యంలో సీఎస్‌ల సదస్సు

* పల్నాడు : ఘర్షణల నేపథ్యంలో నేటి అర్ధరాత్రి వరకు మాచర్లలో 144 సెక్షన్.. మరో సారి 144 సెక్షన్ పొడిగింపు పై ఉత్కంఠ…

* ప్రకాశం : ఒంగోలు లోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అంతర పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీలను ప్రారంభించనున్న మంత్రి మేరుగ నాగార్జున.

* పల్నాడు : నేడు ఆరుద్రోత్సవం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి ఆలయంలో శివ ముక్కోటి ఆరుద్రోత్సవం.. నేటి అర్ధరాత్రి రెండు గంటల నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక అభిషేకాలు…

* కడప నగరంలోని 43వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొ నున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా

Exit mobile version