* తిరువనంతపురం: ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదో టీ-20.. రాత్రి 7 గంటలకు గ్రీన్‌ఫీల్డ్ ఇంటరేషనల్ స్టేడియంలో ప్రారంభంకానున్న మ్యాచ్
* మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను నియమించే అవకాశం.. ఇవాళ ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశంలో.. ఎల్పీ నేతగా సునేత్ర పవార్‌ను ఎన్నుకునే అవకాశం.. ఆ తర్వాత ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు చెబుతున్న పార్టీ నేతలు..
* చిత్తూరు: కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన… ఉదయం 10 గంటలకు బెగ్గిలిపల్లె పంచాయతీలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం.. శాంతిపురం వద్ద ప్రజావేదిక బహిరంగంగా సభ… అక్కడే 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ కార్యక్రమం… కుప్పంలో ఏర్పాటు చేసే ఏడు కొత్త పరిశ్రమలతో మౌఖిక ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమం..
* తెలంగాణలో నిన్నటితో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు.. ఈ రోజు నామినేషన్ల స్క్రూటిని
* ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద పూజలు.. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఘోర అపచారాలకు.. పరిహారంగా పూజలు.. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఘోర అపచారాలకు పాల్పడ్డారంటున్న వైసీపీ..
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో మాఘ మాస పౌర్ణమి గరుడ సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుమల: రేపు రామకృష్ణ తీర్ద ముక్కోటి.. రేపు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ.. రేపు గోగర్బం డ్యాం వరకు మాత్రమే ప్రవైట్ వాహనాలను అనుమతించనున్న టీటీడీ
* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలం వడిగేపల్లి గ్రామంలో పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సవిత, రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్..
* అనంతపురం : ఆర్డిటి స్టేడియం లో అనంత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్. పాల్గొననున్న సినీ నటులు.
* అనంతపురం : తిరుపతి లడ్డుపై దుష్ప్రచారం చేయడానికి వ్యతిరేకిస్తూ గుంతకల్లు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న వైసీపీ నేతలు.
* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 6 వ రోజు స్వామివారికి ఆలయంలో విశేష పూజలు, ఇవాళ స్వామివారి ఉత్సవమూర్తులకు గజ వాహనంపై కొలువు తీర్చి ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం.
* అనంతపురం : గుత్తిలో రూ.5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించునున్న ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ .
* గుంటూరు: నేడు గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నేతలకు మంచి బుద్ది ప్రసాదించాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక పూజలు.
* నేడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
