What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* అమరావతి: నేడు జనసేన పార్టీ కీలక సమావేశం.. పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం..

* అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

* తూర్పుగోదావరి జిల్లా: పులి సంచరణ నేపథ్యంలో సీతానగరం, కోరుకొండ , రాజమండ్రి రూరల్ ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు ఒక రోజు సెలవు.. పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాల పరిధిలో ఈ చర్యలు తీసుకున్న విద్యా శాఖ.. ఈ రోజు నిర్వహించనున్న ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ యథావిధిగా జరుగుతాయి-ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఐ. శారద

* అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో దట్టమైన పొగ మంచు.. ప్రయాణాల్లో ఫాగ్ లైట్స్ వేసుకుని జాగ్రత్తగా వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ జిల్లాలో ఉదయం 9.20 గంటల వరకు మంచు ప్రభావం ఉంటుంది- వాతావరణ శాఖ

* అనంతపురం జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు.. జిల్లా వ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు 30 యాక్ట్ అమలు.. ఈనెల ఒకటి నుంచి 28-02-2026 వరకు 30 యాక్ట్ అమలు. శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జగదీష్ నిర్ణయం. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదు.

* అమరావతి: నేడు జనసేన పార్టీ కీలక సమావేశం.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హల్‌లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటలకు వరకు పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం..

* రేపు WPLలో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడనున్న గుజరాత్-ఢిల్లీ.. వడోదర వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్

* కాకినాడ: నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్ షాన్ మోహన్.. ట్రైనింగ్ నిమిత్తం 25 రోజులపాటు ముస్సోరి వెళ్ళిన కలెక్టర్

* విజయవాడ: నేటి నుంచి సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు.. ఉదయం 11 గంటలకు ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రారంభంకానున్న సమావేశాలు.. హాజరుకానున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు.. బడ్జెట్, తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాల పై చర్చ

* కొమరంభీం జిల్లా : కాగజ్‌నగర్‌ పట్టణానికి నేడు మెదక్ ఎంపీ రఘనందన్ రావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఎంపీ.

* ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు.. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ల లో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ల ప్రకటన.

* నిజమాబాద్ : పోలీస్ ప్రజా వాణి రద్దు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ ప్రజా వాణి తాత్కాలికంగా రద్దు.