Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. స‌చివాల‌యంలో ఉదయం 11 గంట‌ల‌కు సమావేశం.. మూడు కొత్త జిల్లాల ఏర్పాటు, ప‌లు రెవిన్యూ డివిజ‌న్లు కు ఆమోదం తెల‌ప‌నున్న కేబినెట్.. ప‌లు సంస్థలకు భూ కేటాయింపుల‌కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..

* తిరుమల: ఇవాళ అర్దరాత్రి 12:01 గంటలకు శ్రీవారి ఆలయంలో తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు.. వేకువజామున 1 గంట నుంచి ప్రారంభం కానున్న వీవీఐపీల దర్శనాలు.. ఆ తర్వాత టోకేన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్న టీటీడీ.. ఇవాళ నుంచి జనవరి 8వ తేది వరకు సిఫార్సు లేఖలు పై జారి చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. పది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు

* హైదరాబాద్‌: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు

* తిరుమల: 13 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం .. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,823 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,660 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.8 కోట్లు

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుంచి కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ ప్రారంభం.. ‘మీకోసం’ PGRS వేదికతో పాటు భూమి సమస్యలకు ప్రత్యేక పరిష్కారం.. యధాతధంగా పిజిఆర్ఎస్.. వాట్సప్ గవర్నెన్స్ – ‘మన మిత్రా’ యాప్ ద్వారా పౌర సేవలు..

* నంద్యాల: మహానంది క్షేత్రంలో సోమవారం సందర్భంగా స్వామివారికి మహా రుద్రాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ

* నంద్యాల: నేడు శ్రీశైలం ఆలయంలో వెండి రధోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేడు భద్రాచలం వద్ద గోదావరిలో తెప్పోత్సవం.. హంస వాహనం పై సీత రామ చంద్రుల గోదావరిలో విహారం.. రేపు ముక్కోటి ద్వార దర్శనం

* ఆదిలాబాద్: నేడు నాగోబాకు చేరుకోనున్న ప్రచార రథం. ఏడు రోజుల పాటు నాగోబా జాతర కోసం ప్రచారం నిమిత్తం వెళ్లిన చెక్ డా (ఎడ్ల బండి). రేపటి నుంచి కేస్లాపూర్ నుంచి పవిత్ర గంగాజల సేకరణ పాదయాత్ర.

* భద్రాద్రి: నేటి నుంచి కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. హాజరుకానున్న సీఎండీ కృష్ణ భాస్కర్

* నిజమాబాద్ : నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ.. యూరియా బుకింగ్ యాప్ లో బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా అమ్మకం. ప్రతి రైతుకు యూరియా అందిస్తాం.. వ్యవసాయ శాఖ

* నిజామాబాద్ జిల్లా: వేల్పూర్ మండలం లక్కోరలో నేడు నియోజకవర్గస్థాయి క్రిస్మస్ సంబరాలు

* నేడు ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ తో పాటు బీజేపీ ఢిలీల్లీ నేతలను కలవనున్న రామ చందర్ రావు

Exit mobile version