* IPL 2026: ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* ఇవాళ బెంగాల్‌లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. 142 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్.. ఓటు వేయనున్న 3.21 కోట్ల మంది ఓటర్లు.. బరిలో 1,448 మంది అభ్యర్థులు
* అమరావతి: ఇవాళ టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణస్వీకారం.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రమాణ స్వీకారం.. ఉదయం 9 .30కు జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమం. 252 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటుచేసిన టీడీపీ అధిష్టానం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న మంత్రి నారా లోకేష్..
* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో ఏపీ సీఎస్ నివాసానికి సీఎం చంద్రబాబు. సీఎస్ సాయి ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.
* అమరావతి: రేపు ఏపీ కేబినెట్ సమావేశం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10.30కు కేబినెట్ భేటీ..
* ఇవాళ ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విచారణ.. పిటిషన్లు దాఖలు చేసిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందన్న.. రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్న ముగ్గురు నిందితులు.. ఇవాళ విచారణ చేపట్టనున్న న్యాయస్థానం..
* ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. ఇవాళ రాజమండ్రి కోర్టులో విచారణ
* ఇవాళ కాకినాడలో కేంద్రమంత్రి మురుగన్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి..
* ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన.. పాలేరు, అరెంపుల లో ప్రజాదర్బార్ లో పాల్గొననున్న మంత్ర పొంగులేటి
* ఖమ్మం నరసింహ స్వామి గుట్ట బ్రహ్మితవాల్లో పాల్గొననున్న మంత్రి తుమ్మల
* జగిత్యాల జిల్లా : ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు.. వివిధ పండ్ల రసాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసిన అర్చకులు.. కనులారా వీక్షించేందుకు తరలి వచ్చిన భక్తులు
* తూర్పుగోదావరి: నేడు రంగంపేట మండలం దొడ్డిగుంట మత్స్య సహకర సంఘం ఎన్నికలు.. వివాదాలు కారణంగా మార్చి 5 న జరగాల్సిన ఎన్నికలు వాయిదా.. ఓటర్లను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు.. ఆ కేసు లో ఐదుగురు అరెస్ట్, మరో ఇద్దరి కోసం కొనసాగుతున్న గాలింపు
* కర్నూలు: నేడు గూడూరు (మం) గుడిపాడులో శ్రీ మారెమ్మ దేవర మహోత్సవం
* తిరుమల: 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు .. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,980 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 26,511 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు
