Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేడు సౌతాఫ్రికా, భారత్‌ మహిళా జట్ల మధ్య ఐదో టీ20.. సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకున్న సౌతాఫ్రికా..

* ఐపీఎల్‌: నేడు ఢిల్లీ వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్‌ ప్రారంభం..

* బెంగాల్‌లో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి ఉదయం రెండో విడత పోలింగ్‌.. మే 4న ఫలితాలు..

* నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. 25 ఏళ్లు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్.. తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు పార్టీ జెండా ఎగరవేయనున్న కేటీఆర్. గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. పార్టీ నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం… హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ లు. నేతలతో తాజా రాజకీయ పరిణామాల పై చర్చ.. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం ఉండే అవకాశం..!.

* విశాఖ: నేడు ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకలు… ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో పూర్తైన ఏర్పాట్లు… ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. గౌరవ అతిథిగా సచిన్ టెండూల్కర్.. వేడుకల్లో పాల్గొనున్న గవర్నర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

* నేడు, రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఇవాళ విశాఖలో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు.. ఉపరాష్ట్రపతితో కలిసి ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం.. రేపు గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

* హైదరాబాద్‌: ఇవాళ ఉదయం 10.30కి ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్న అజారుద్దీన్.. కోదండరాం.. ప్రమాణ స్వీకారం చేయించనున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

* కాకినాడ: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నేడు ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీకి పిటిషన్‌ దాఖలు చేయనున్న పోలీసులు.. సాక్షులను బెదిరించిన కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఉన్న అనంతబాబు

* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నివాసంలో SIPB సమావేశం.. ఏపీకి వచ్చే పెట్టుబడులపై సమీక్ష.. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో డీజిల్‌ కొరతపై సీఎం సమీక్ష..

* అనంతపురం : ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో ప్రజా దర్బార్లో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్.

* అనంతపురం : ఉరవకొండ పరిధిలోని పెన్నహోబిలంలో రేపటి నుంచి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. మే 4 న గరుడ వాహనోత్సవం… శ్రీవారి కల్యాణోత్సవం…. 6న బ్రహ్మరథోత్సవం

* తిరుమల: 30 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,878 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 33,037 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు

* కర్నూలు: మంత్రాలయం శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి బిల్వార్చన, తులసి అర్చన, పుష్పర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, రుధ్రాభిషకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు.

* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. ఇవాళ గరుడ వాహనం పై నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న మలయప్పస్వామి.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు

* ఆదిలాబాద్: నేటి ప్రజావాణి రద్దు.. జిల్లా ఉన్నతాధికారులకు హైదరాబాద్ లో సమీక్ష కారణంగా ప్రతీ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రకటన.

Exit mobile version