What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* IPL 2026: నేడు SRH vs RCB… హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్‌

* ఇవాళ హైదరాబాద్‌ మెట్రో రైలు సేవల సమయం పొడిగింపు.. నేడు ఉప్పల్‌ స్టేడియంలో SRH Vs RCB ఐపీఎల్‌ మ్యాచ్‌.. ఈ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసుల పొడిగింపు..

* అమరావతి: ఇవాళ సచివాలయంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో రవాణా శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు సమావేశం.. సాయంత్రం 4 గంటలకు జరగనున్న సమావేశం.. పలు డిమాండ్లతో ఇటీవల ధర్నాలు చేసిన ఎంప్లాయిస్ యూనియన్, NMUA

* హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్

* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ.

* కర్నూలు: నేడు తుగ్గలి (మం) జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి కొల్లు రవీంద్ర. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు గోల్డ్ మైనింగ్ ను ప్రారంభించే అవకాశం.

* తూర్పు గోదావరి జిల్లాలో హీట్‌వేవ్ పరిస్థితులపై అప్రమత్తం.. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్ 8977935611 అందుబాటులో.. రానున్న మూడు రోజులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కోస్తా ఆంధ్రలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి– కలెక్టర్ కీర్తి చేకూరి సూచనలు