* ఐపీఎల్: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ.. రాత్రి 7.30కి ముంబై వేదికగా మ్యాచ్
* ఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై నేడు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్న కేంద్ర ప్రభుత్వం
* విజయవాడ: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ.. ఏ1 రాజ్ కేసిరెడ్డి, ఏ31 ధనుంజయ్ రెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్ల మీద విచారణ చేయనున్న కోర్టు
* అమరావతి: ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు మీడియా సమావేశం..
* నేడు కుప్పం పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి కుప్పం వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం కుటుంబ సమేతంగా శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ దర్శనం చేసుకోనున్న సీఎం చంద్రబాబు.. సాయంత్రం తిరిగి ఉండవల్లి నివాసానికి ఏపీ సీఎం..
* హైదరాబాద్: ఉదయం 10:30కు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి ని పురస్కరించుకుని సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సాయంత్రం చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గ ఎమ్మెల్యేలతో సమావేశం
* రేపట్నుంచి మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. కొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశం… కానున్న సీఎం చంద్రబాబు.. 24 న ఢిల్లీ లో జరిగే నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
* అమరావతి: ఇవాళ బెంగళూరుకు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్.. కుంకీ ఏనుగులను ఏపీకి రప్పించే కార్యక్రమానికి హాజరవుతున్న డిప్యుటీ సీఎం.. అడవి ఏనుగుల దాడులతో రైతుల పంటలకు, గ్రామీణ జనాభాకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి ముందడుగు వేసిన కూటమి ప్రభుత్వం.. కర్ణాటకలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను అధికారికంగా ఏపీకి అప్పగించనున్న కర్ణాటక ప్రభుత్వం.
* కర్నూలు: ఎమ్మిగనూరు లో నేడు వందపడకల ఆస్పత్రిని ప్రారంభించనున్న ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి
* బాపట్ల జిల్లా: నేడు రేపల్లెలో మినీమహానాడు, పాల్గొనున్న మంత్రులు అనగాని సత్య ప్రసాద్, కొలుసు పార్దసారధి, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్.
* కడప : నేడు బద్వేల్ లో మినీ మహానాడు… మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు టిడిపి నాయకుడు రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఆర్ ఆర్ ఫంక్షన్ హల్ నందు మినీ మహానాడు… కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొననున్నారు…
* తిరుమల: రేపు తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు.. రేపు జపాలి హనుమాన్ కి టిటిడి తరపున పట్టువస్త్రాలు సమర్పణ.. రేపు శ్రీవారి ఆలయం ఎదురుగా వున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం,మొదటి ఘాట్ రోడ్డు 7వ మైలు వద్ద వున్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు
* విశాఖ: నేడు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పర్యటన.. వీఎంఆర్డీఏ,GVMCలో అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్ష… పాల్గొనున్న ఎమ్మెల్యేలు
* విశాఖ: నేటి నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ దీక్షకు సిద్ధమైన షర్మిల
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గం టిడిపి మినీ మహానాడు.. బూరుగుపూడి గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న మినీ మహానాడు .. హాజరుకానున్న రాజనగరం నియోజకవర్గంలోని టిడిపి నేతలు పార్టీ శ్రేణులు
* అనంతపురం : గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి వివిధ రకాల పండ్లతో ప్రత్యేక అలంకరణ.
* అనంతపురం : ఇవాళ జడ్పీ సర్వసభ్య సమావేశం. హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు
* కర్నూలు: నేడు కోడుమూరు మండలం వెంకటగిరిలో శ్రీ గిడ్డాంజనేయ స్వామి ప్రభోత్సవం