NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం.. రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో టైటాన్స్‌ Vs బెంగళూరు మ్యాచ్‌..

* హైదరాబాద్‌: నేడు ఉదయం 11.30కి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టు కేసు నేపథ్యంలో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న కోర్టు..

* బాపట్ల : బల్లికురవ మండలం అంబటిపూడిలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొననున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..

* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు నిడదవోలులో “పల్లె పండగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్‌.. ఉదయం 10 గంటలకు పెరవలిలో .. 10:30కి పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలో 11కి ఖండవల్లి (గవర్లపాలెం)లో 11:30కి ముక్కామలలో.. మధ్యాహ్నం 12 గంటలకు పిట్లవేమవరంలో.. 12:30కి కడింపాడులో 1 గంటకు మల్లేశ్వరంలో 1:30కి అన్నవరప్పాడులో పాల్గొననున్న మంత్రి.

* శ్రీ సత్యసాయి : సత్యసాయి మహాసమాధి దర్శనార్దం పుట్టపర్తికి రానున్న కేంద్రమంత్రి మురగన్.

* అమరావతి: ధరల స్థిరీకరణపై నేడు సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రివ్యూ.. పాల్గొనున్న మంత్రులు అచ్చెం నాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్..

* అమరావతి: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ లు

* విజయనగరం: నేడు దత్తిరాజేరు, గంట్యాడ, జామి మండలాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన.. పల్లె పండుగ కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి..

* హైదరాబాద్: నేడు ముషీరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. గాంధీ నగర్, హరిత అపార్ట్మెంట్ లైన్, ఆంధ్ర కేఫ్ X రోడ్ లో సేవరేజ్ లైన్ ను ప్రారంభించనున్న మంత్రి..

* వికారాబాద్‌ జిల్లా: నేడు నూతన మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ప్రమాణ స్వీకార కార్యక్రమం.. హాజరుకానున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్న శ్రీధర్ బాబు

* తిరుమల: రేపటి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ

* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,637 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,956 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు

Show comments