Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కపిల్ సిబల్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి రేవంత్

* సింగపూర్ – విజయవాడ విమాన సర్వీసు నేటి నుంచి ప్రారంభం.. ఈ రోజు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభం కానున్న విమాన సర్వీసు

* అనకాపల్లి జిల్లా: నేడు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన.. మెడిటెక్ జోన్, బ్రాండిక్స్ అప్పెరల్ సిటీని సందర్శించనున్న పీయూష్ గోయల్..

* శ్రీ సత్యసాయి : నేటి నుంచి మూడు రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న బాలకృష్ణ.. చిలమత్తూరులో అధికారులు నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న బాలకృష్ణ.

* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి లో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.

* శ్రీసత్యసాయి : నేడు పుట్టపర్తి లో పర్యటించనున్న కేంద్ర మంత్రి పీయూష గోయల్.. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి.. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్న కేంద్ర మంత్రి పీయూష గోయల్

* తిరుమల: 12 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,709 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,053 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

* సిద్దిపేట జిల్లా: నేడు హుస్నాబాద్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటన.. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలను విడుదల చేయనున్న మంత్రులు

* నిజమాబాద్ జిల్లాలో నేటి నుంచి చేప పిల్లల పంపిణీ.. అశోక్ సాగర్ చెరువులో చేప పిల్లలను వదలనున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. జిల్లాలో 967 చెరువుల్లో 4.54 కోట్ల చేప పిల్లలను వేయాలని మత్స్య శాఖ లక్ష్యం

* కామారెడ్డి : నేడు జిల్లా కేంద్రంలో బీసీ ఆక్రోశ సభ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధన లక్ష్యంగా ఆక్రోశ సభ.. జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు , విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో సభ.

* తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత.. రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీలు నమోదు

* పల్నాడు జిల్లా: నేడు క్రోసూరు మార్కెట్ యార్డులో సీసీఐ ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

Exit mobile version