* ఢిల్లీ: ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం..
* అమరావతి : ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు.. 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలసి నిరసన ర్యాలీలు చేపట్టనున్న వైసీపీ శ్రేణులు.. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలో పాల్గొననున్న వైసీపీ ముఖ్య నేతలు..
* కాకినాడ: నేడు సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం సమావేశం.. చైర్‌పర్సన్ అరుణ పై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన 23 మంది కౌన్సిలర్లు.. ఆర్డీవో మల్లిబాబు ప్రత్యేక అధికారిగా అవిశ్వాస తీర్మానంపై జరగనున్న ఓటింగ్
* అమరావతి: ఇవాళ అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల్లో గృహప్రవేశాలు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. సోషల్ మీడియా ప్రతిభావంతులతో ముచ్చటించనున్న సీఎం. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీకానున్న సీఎం చంద్రబాబు…
* అన్నమయ్య జిల్లా : నేడు చిన్నమండెం లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన… సీఎం పర్యటన సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు… కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం…
* అనంతపురం : తాడిపత్రి లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమాలు చేపట్టనున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.
* అనంతపురం : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు.
* శ్రీ సత్యసాయి : ఈనెల 15 నుంచి మూడు రోజులపాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు.
* కాకినాడ: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పై నేడు వైసిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు.. జిల్లాలో సెక్షన్ 30 అమలులో ఉందని ప్రకటించిన ఎస్పీ.. నిరసన కార్యక్రమాలు చేయాలంటే పోలీసులు అనుమతులు తప్పనిసరని ప్రకటన.. శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని భావిస్తే అనుమతులపై ఆంక్షలు విధించి, కేసులు పెట్టే అవకాశం
* కర్నూలు: నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.. ప్రత్యేక విమానంలో ఉ.10.30 కు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న గవర్నర్.. 11 గం.లకు రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్.. 12 గంటలకు కర్నూలులో ఓ ప్రైవేట్ స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. సాయంత్రం 4.10 కి కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి విజయవాడ వెళ్లనున్న గవర్నర్
* అంబేద్కర్ కోనసీమ: జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలు..పబ్లిక్ మీటింగ్‌లు, ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలకు తప్పనిసరిగా స్థానిక పోలీస్ అధికారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి… అనుమతి లేకుండా మీటింగ్‌లు , ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు : ఎస్పీ
* కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన
* ములుగు: నేడు మేడారానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్.. మహా జాతర నేపథ్యంలో మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు.. ఉదయం 11 గంటలకు హెలీకాప్టర్‌లో మేడారానికి చేరుకోనున్న మంత్రులు..
* విజయవాడ: పెనమలూరుకి చెందిన వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు నేటికి వాయిదా.. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసభ్యకర పోస్టులు పెట్టిన విజయభాస్కర్ రెడ్డి.. తండ్రి కర్మ కాండల కోసం 5 రోజులు అనుమతి కోరుతూ పిటిషన్ .. విచారణ జరిపి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు నేటికి వాయిదా
* అమరావతి: నేడు తిరుపతిలో సీఐడీని కలవనున్న టీడీపీ బృందం.. పరకామణి కేసులో సీఐడీ ఏడీజీని కలిసి వినతిపత్రం ఇవ్వనున్న వర్ల రామయ్య బృందం
* నెల్లూరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి ఆధ్వర్యంలో ఆందోళన.. ఆయా నియోజకవర్గ కేంద్రాలలో జరిగే ర్యాలీలో పాల్గొననున్న ఇంచార్జ్‌లు
* నేడు ఏపీ లిక్కర్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ.. నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారించనున్న కోర్టు.. విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్, బాలాజీ యాదవ్
* అమరావతి: హైకోర్టులో బీసీ సంక్షేమ సంఘం పిల్.. బీసీ జనగణన, వర్గీకరణ చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పిల్ దాఖలు.. ఇవాళ విచారణ చేపట్టనున్న హైకోర్టు
