* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం 2.30కి సీఆర్డీఏ 45వ సమావేశం.. రాజధాని పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న అథారిటీ
* హైదరాబాద్: నేడు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం.. హాజరుకానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరుపై రానున్న క్లారిటీ..
* నేడు ఢిల్లీకి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మోర్త్ సెక్రెటరీ ఉమాశంకర్, నేషనల్ హైవేస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో సమావేశం కానున్న కోమటిరెడ్డి. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్డు పై చర్చించనున్న మంత్రి.
* నేడు ములుగు జిల్లా లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన.. దత్తత తీసుకున్న తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని సందర్శించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దత్తత గ్రామంలో అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలన.. కొండపర్తి గ్రామంలో కొమరం భీమ్, బిర్సా ముండా విగ్రహాలను ఆవిష్కరణతో పాటు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సోలార్ ఆర్గనైజింగ్ సిస్టం కమ్యూనిటీ భవనం ను ప్రారంభించనున్న గవర్నర్. అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
* జగిత్యాల జిల్లా : ఘనంగా కొనసాగుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం గోధూళి సుముహూర్తమున స్వామి వార్ల కల్యాణం
* అమరావతి : ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న శాసనమండలి సమావేశాలు.. వాడివేడిగా సాగుతున్న మండలి సమావేశాలు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ప్రతీరోజూ కొనసాగుతున్న మాటల యుద్ధం..
* ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ నియమాల యొక్క నోటిఫికేషన్ ప్రతిని, 1968, ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ చట్టంలోని 72 (4)వ సెక్షను క్రింద ఆవశ్యకమైన విధంగా సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర.. వ్యవసాయ రంగంలో సంక్షోభంపై లఘు చర్చ.. ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో.. ఇసుక అక్రమ అమ్మకం.. వార్తా పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలు.. విజయవాడ నగరంలో వరదలకు విరాళాలు.. సుంకం చెల్లించని మద్యం అమ్మకాలపై కేసులు..
* తిరుమల: శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో మూడోవ రోజు.. ఇవాళ తెప్పల పై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
* నేడు విజయవాడకు కాంగ్రెస్ ఢిల్లీ నేతలు.. 11 గంటలకు జరిగే ఏపీ కాంగ్రెస్ బీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ బీసీ విభాగం చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్.. 10:30కు విజయవాడ ధర్నాచౌక్ లో జరిగే నిరుద్యోగ సమస్యపై ధర్నాలో పాల్గొననున్న ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను చిబ్…
* అమరావతి : రేపు వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో యువతపోరు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు.. రేపు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం..ఆవిర్భావ దినోత్సవంతో పాటు యువత పోరు కార్యక్రమాన్ని కూడా కలిపి నిర్వహించనున్న వైసీపీ శ్రేణులు.. విద్యార్దులకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందంటూ ఆందోళన..
* అనంతపురం : యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ ఆంజనేయ వాహన సేవ
* అమరావతి: ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం.. అమరావతి రాజధాని.. నంద్యాల లో తెలుగు గంగ కాలవ..రాష్ట్రంలో అంగన్ వాడి భవనాలు పై ప్రశ్నలు. వృద్దుల సంక్షేమం.. శారీరక మేధో అంగ వైకల్యం కల పిల్లలకు విద్య.. పుత్తూరు మున్సిపాలిటీ నిధులకు సంబంధించి ప్రశ్నలు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాజరుకానున్న వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్.. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు ముగిసిన కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు.. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లను దూషించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ
* తిరుమల: 13 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనంకు 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,746 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,649 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు
* నంద్యాల: నేడు నందికొట్కూరు మండలం కొనిదేల శ్రీ శ్రీ శ్రీ మత్కొణిదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల.. స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవం..
* తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు సీట్లకు.. ఐదు నామినేషన్ దాఖలు.. నేడు నామినేషన్ లా స్క్రూటినీ.. ఈ నెల 13న నామినేషన్ లా ఉపసంహరణ.. 13వ తేదీనే అధికారికంగా ఏకగ్రీవ ప్రకటన
* SLBCలో 18వ రోజు కు చేరిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్. GPR, క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు. మరో ఏడు మృతదేహాల కోసం సెర్చ్. ఇవాళ సాయంత్రానికి రెండు డెడ్ బాడీస్ తీసే అవకాశం.. కొనసాగుతున్న TBM మిషన్ కటింగ్, డీ వాటరింగ్