NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* ఐపీఎల్‌లో నేడు తొలి మ్యాచ్‌లో తలపడనున్న పంజాబ్‌- హైదరాబాద్‌, మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.

* ఐపీఎల్‌లో నేడు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌, రాత్రి 7.30 గంటలకు ప్రారంభం.

* గుంటూరు జిల్లా జూపూడిలో 4వ రోజు కొనసాగుతున్న పోలీస్‌ పికెటింగ్‌..

* ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నేడు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు, దళిత విప్లవ కవి కేజీ సత్యమూర్తి స్మారక సభ..

* ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ స్వామి వారి కళ్యాణం.

* ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ స్వామి వారి కళ్యాణం..

* అనకాపల్లి జిల్లాకు నేడు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు రాక… మంత్రిపదవి చేపట్టిన తర్వత తొలిసారి జిల్లాకు వస్తున్న బూడి

* నేడు నెల్లూరుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..

* నేడు నెల్లూరు నగరంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ

* సత్యసాయి జిల్లా : సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామంలోని శ్రీ సజ్జకంట స్వామి బ్రహ్మ రథోత్సవంలో భాగంగా నేడు ఆది దీపోత్సవం.

* నేడు గుంటూరులో పర్యటించనున్న గవర్నర్ బిశ్వభూషణ్.. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ను సందర్శించనున్న గవర్నర్

* నేడు శ్రీకాకుళం‌ జిల్లాకు మంత్రి అప్పలరాజు.. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు అప్పలరాజు.

* తిరుపతి: నేటి నుంచి అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ప్రారంభం

* నేడు విశాఖ శారదాపీఠానికి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు

* ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పున:రుద్ధరణ..

* హైదరాబాద్‌: ఫుడింగ్‌ అండ్‌ పబ్‌ డ్రగ్‌ కేసులో నేటితో ముగియనున్న నిందితుల పోలీసు కస్టడీ