Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు గుజరాత్‌లో 108 అడుగుల హనుమాన్‌ విగ్రహావిష్కరణ, ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

* నేడు సీఎం జగన్ కర్నూలు పర్యటన, వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి కుమారుని పెళ్లి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్

* తిరుపతి: నేడు ఎస్వీ యూనివర్సిటీలో జాబ్‌ మేళా.. నేటి నుంచి రెండు రోజుల పాటు జాబ్‌ మేళా, పాల్గొననున్న 137 కంపెనీలు, ఇప్పటి వరకు 1.34 లక్షల మంది రిజిస్ట్రేషన్‌

* నేడు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్‌.. ఇవాళ ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైన్‌ షాపులు, పబ్‌లు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేత

* ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.. సూర్య వాహనంలో భక్తులకు స్వామి వారి దర్శనం

* ప్రకాశం జిల్లా చీమకుర్తి హరిహర క్షేత్రంలో చివరి రోజు 16వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు.. హాజరుకానున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, విశాఖ పీఠ ఉత్తరాదికారి స్మాత్మానందేంద్ర స్వామి

* విశాఖ: నేడు హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ, అక్కయ్యపాలెం నుంచి బీచ్ రోడ్ వరకు భారీ బైక్ ర్యాలీకి సన్నాహాలు

* విశాఖ: నేడు బీచ్ రోడ్డులో హనుమాన్ శోభాయాత్ర… పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్కేబీచ్ వరకు ర్యాలీ.. పాల్గొననున్న పరిపూర్ణానంద స్వామి

* ప్రకాశం జిల్లా ఒంగోలులో నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి ఉత్సవాలు..

* ఒంగోలు సంతపేట ఆంజనేయ స్వామి ఆలయం నుండి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వ్యంలో హనుమాన్ శోభా యాత్ర..

* ప్రకాశం జిల్లా పెద్దారవీడు లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు నాగుల్ మీరా స్వామి ఉరుసు మహోత్సవాలు..

* ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు..

* అనంతపురం : అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో నేడు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* అనంతపురం – రాయదుర్గం పట్టణంలో సుప్రసిద్ధ శ్రీ జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారి బ్రహ్మ రథోత్సవం.

* తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు, ఇవాళ మలయప్పస్వామివారికి, శ్రీరాములవారికి, శ్రీకృష్ణ స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్న అర్చకులు

* సత్యసాయి జిల్లా : నేటి నుంచి ఆమడగూరు చౌడేశ్వరిదేవి ఉత్సవాలు.

* సత్యసాయి జిల్లా – సోమందేపల్లి మండలం గుడి పల్లి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి బ్రహ్మ రథోత్సవం.

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రిలో నవయూగ వైతాళికులు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 175వ జయంతి వేడుకలు

* తూర్పుగోదావరి జిల్లాలో నేడు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పర్యటన, రాజమండ్రిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్‌.

* ఖమ్మం: మధిర మండలంలో 22వ రోజు కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

* నేడు కొత్తగూడెం నియోజకవర్గంలో వైఎస్సార్ టీపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర

Exit mobile version