Kolkata Doctor Case: ఇంత అర్జెంట్ ఎందుకు..? ఆర్జీ కర్ ఆస్పత్రి పనులపై హైకోర్టు ప్రశ్న..
- ఆర్జీ కర్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులపై హైకోర్టు ఆగ్రహం..
- ఇంత అత్యవసరం ఏంటి..? అని ప్రభుత్వానికి ప్రశ్న..
- నేర దృశ్యం చెక్కుచెదరకుండా ఉందని నిరూపించడానికి ఫోటోలు సమర్పించాలి..
- బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యాచారం జరిగిన సెమినార్ హాల్ సమీపంలోని భాగాలను పునరుద్ధరించాల్సిన అత్యవసరం ఏమిటి..? అని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శుక్రవారం ఈ అంశాన్ని హైకోర్టు విచారించింది. నేరం జరిగిన ప్రదేశం నుంచి సాక్ష్యాలు నాశనం చేయడానికి ఆస్పత్రిలో అత్యవసరంగా సెమినార్ హాలు చుట్టూ కూల్చివేత పనులు జరిగాయనే ఆరోపణలపై సమాధానం చెప్పాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
Read Also: Rajanna Sirisilla District: బాబాయ్ ని ఇరికించేందుకు అబ్బాయి కిడ్నాప్ డ్రామా.. అవాక్కైన పోలీసులు
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదిస్తున్న న్యాయవాది ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. వైద్యుల కోసం వాష్‌రూములను నిర్మించడానికి పనులు చేపడుతున్నట్లు చెప్పాడు. కూల్చివేత పనులు జరుగుతున్న ప్రదేశం సంఘటన స్థలానికి దగ్గర్లో లేదని, దీనిపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని చెప్పారు. అయితే, చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో పనులు చేయడాన్ని ప్రశ్నించారు. ‘‘ అత్యవసరంగా 12 గంటల్లో రెస్ట్ రూములను అందించడం అంత ముఖ్యమా..? మీరు ఏదైనా జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెళ్లండి. మహిళలకు రెస్ట్ రూములు ఉన్నాయో లేదో చూడండి. నేను బాధ్యతతో చెబుతున్నాను, పీడబ్ల్యూడీ ఏం చేస్తుంది..? కోర్టు సముదాయాలల్లో అక్కడ విశ్రాంతి గదుల పరిస్థితిని చూడండి’’ అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. బెంగాల్ ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఆస్పత్రిలోకి చొరబడి కొందరు దుండగులు దాడి చేయడంపై కూడా పోలీసుల తీరును ప్రశ్నించింది. బాధితురాలికి మద్దతుగా బుధవారం పెద్ద ఎత్తున ర్యాలీ జరిగిన సమయంలో ఈ దాడి జరిగింది. 7000 మంది ప్రజలు గుమిగూడే విషయం పోలీసులకు తెలియకపోవడం పూర్తిగా వైఫల్యమే అని కోర్టు వ్యాక్యానించింది. నేరం జరిగిన ప్రదేశం చెక్కుచెదరకుండా ఉందని నిరూపించేందుకు ఫొటోలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!