Site icon NTV Telugu

BJP: చిన్మయి-వైరముత్తు ఇష్యూపై బీజేపీ కామెంట్స్.. సీఎం స్టాలిన్‌పై అన్నామలై ఆగ్రహం..

Chinmai, Viramuttu Issue

Chinmai, Viramuttu Issue

Annamalai: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించడమే కాకుండా.. అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా రెజ్లర్లు వారి మద్దతుదారులు కొత్త పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లి ఆందోళన నిర్వహించాలని అనుకున్నారు. దీంతో రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు.

దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. తొలి రోజే రాజదండం(సెంగోల్) వంగిపోయిందంటూ కామెంట్స్ చేశారు. రెజ్లర్లకు మద్దతుగా కేంద్రాన్ని విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున కూడా ఇలాంటి దారుణం జరగడం న్యాయమా? అంటూ, రాష్ట్రపతిని పక్కకు తప్పించి ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య ప్రారంభోత్సవం అంటూ కామెంట్స్ చేశారు.

Read Also: Naresh : పవిత్రా లోకేష్ తో పిల్లల్ని కంటే తప్పేంటి?..నరేష్ షాకింగ్ కామెంట్స్..

ఇదిలా ఉంటే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ముఖ్యమంత్రి స్టాలిన్ పై విరుచుకుపడ్డారు. ప్రముఖ గాయని చిన్మయి, తమిళ టాప్ రచయిత వైరముత్తు వివాదంలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. బ్రిజ్ భూషన్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను, వైరముత్తుపై వచ్చిన లైంగిక ఆరోపణలతో పోల్చారు. బ్రిజ్ భూషన్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని.. వైరముత్తుపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో చట్టాన్ని అనుసరిస్తున్నామని, మరి వైరముత్తు కేసులో ఎందుకు అనుసరించడం లేదని స్టాలిన్ ను ప్రశ్నించారు.

వైరముత్తు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. అతనిపై 19 లైంగిక ఆరోపణల ఫిర్యాదులు వచ్చాయి. ప్రముఖ సింగర్ చిన్మయి, వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసిన వారిలో ఉన్నారు. 2018లో ఆయనకు వ్యతిరేకంగా మీటూ ఉద్యమాన్ని లేవనెత్తారు. అయితే తమిళ చిత్ర పరిశ్రమ ఈ ఆరోపణల నేపథ్యంలో చిన్మయిపై బ్యాన్ విధించింది. వైరముత్తుకు అక్కడి చిత్రపరిశ్రమ అండగా నిలిచింది. ఇటీవల కమల్ హాసన్ ఇలాగే రెజ్లర్లకు మద్దతు తెలిపుతూ ట్వీట్ చేశారు. ఓ రచయితపై లైంగిక ఆరోపణలు చేసినందుకు ఓ గాయనిపై తమిళనాడు బ్యాన్ విధించింది, మరి ఇదెందుకు కనిపించడం లేదని కమల్ హాసన్ ని ప్రశ్నించారు చిన్మయి.

Exit mobile version