ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( WFI ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 12 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( WFI ) చీఫ్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు మరియు 10 ఫిర్యాదులు దాఖలు చేశారు.
Annamalai: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించడమే కాకుండా.. అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా రెజ్లర్లు వారి మద్దతుదారులు కొత్త పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లి ఆందోళన నిర్వహించాలని అనుకున్నారు. దీంతో రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో అగ్రశ్రేణి క్రీడాకారులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలిశారు. మాజీ ఒలింపియన్ అయిన పీటీ ఉష అక్కడ గుమిగూడిన మీడియాతో మాట్లాడకుండా నిరసన స్థలం నుంచి వెళ్లిపోయారు.
దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసనల కారణంగా గత నాలుగు నెలలుగా క్రీడలో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. తనను ఉరితీసినా సిద్ధంగా ఉన్నానని.. అయితే జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, క్యాంపులతో సహా రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోకూడదని, ఇది క్యాడెట్, జూనియర్ రెజ్లర్‌లకు హానికరమని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పేర్కొన్నారు.