West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
- బెంగాల్‌లో రికార్డ్ స్థాయి ఓటింగ్..
- సాయంత్రం 5 గంటలకు 90 శాతం నమోదు..
- క్యూ లైన్లలో భారీగా ఉన్న ఓటర్లు..
- పోలింగ్ శాతం 90 శాతాన్ని దాటి నమోదయ్యే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Election: పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత పోలింగ్ భారీ రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు పోలింగ్ సెంటర్ల ముందు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్‌లో 90 శాతం( 89.93%) ఓటింగ్ నమోదైంది. చాలా మంది ఇంకా క్యూ లైన్లలో నిలిచి ఉండటంతో ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి విడతలో భాగంగా బెంగాల్‌లో 152 స్థానాలకు గురువారం ఓటింగ్ జరిగింది. బెంగాల్‌లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 294 కాగా, రెండోదైన చివరి విడత పోలింగ్ 142 స్థానాలకు ఏప్రిల్ 29న జరుగనుంది.
Read Also: TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
పోలింగ్ సరళిని చూస్తే అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. బెంగాల్ మొదటి విడత ఎన్నికల్లో 1478 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బెంగాల్ ఎన్నికల్లో మరోవైపు హింస చెలరేగింది. ముర్షిదాబాద్‌లో టీఎంసీ కార్యకర్తలు ఏయూజేపీ పార్టీ చీఫ్ హుమాయున్ కబీర్‌పై దాడులు చేశారు. సిలిగురిలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కుమార్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై టీఎంసీ గుండాలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు, ఈ ఓటింగ్ చూస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓట్ల తొలగింపుపై ప్రజల కోపాన్ని సూచిస్తోందని ఇది టీఎంసీకి అనుకూలమే అని సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేసింది. మరోవైపు, మే 4 టీఎంసీకి గుడ్ బై అంటూ బీజేపీ చెబుతోంది.
మరోవైపు, తమిళనాడులో ఒకే విడతలో మొత్తం 234 స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఆ రాష్ట్రంలో 82.24 శాతం ఓటింగ్ నమోదైంది. గంటగంటకు పోలింగ్ పెరుగుతుండటంతో అధికార వ్యతిరేక ఓటింగ్ నమోదవుతున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తమిళనాడులో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు విజయ్ టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఎండల్ని లెక్క చేయకుండా తమిళ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజావార్తలు
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!