Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
- నందిగ్రామ్, రెజీనగర్‌లో భారీ విక్టరీ
- నందిగ్రామ్‌లో గత రికార్డ్ బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించింది. నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ స్థానాల్లో కమలం పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఇక నందిగ్రామ్‌లో అయితే గత రికార్డ్లను బద్దలు కొట్టి కాషాయ పార్టీ గెలుపొందింది. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి హసీ రాణి రథ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌పై ఏకంగా 1.22 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1967 తర్వాత నందిగ్రామ్‌లో ఇదే అత్యధిక విజయంగా రికార్డ్ నమోదు చేసింది.
హసీ రాణి రథ్‌కు 1,64,227 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు 41,674 ఓట్లు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య విజయ మార్జిన్ 1,22,553 ఓట్లుగా నమోదైంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీజేపీ అభ్యర్థి 75 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా రికార్డ్ విజయం దిశగా వెళ్తోంది.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
హసీ రాణి రథ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సన్నిహితుడు చంద్రనాథ్ రథ్ తల్లి. ఈ ఏడాది మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో చంద్రనాథ్ రథ్ కాల్పుల్లో హత్యకు గురయ్యారు. హత్య ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చంద్రనాథ్ రథ్ తల్లి ఇప్పుడు నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్ నియోజకవర్గం నుంచి కూడా విజయం సాధించారు. భవానీపూర్ గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన స్థానం. రెండు స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో సువేందు అధికారి నందిగ్రామ్ సీటును వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
నందిగ్రామ్‌లో గతంలోనూ భారీ విజయాలు నమోదయ్యాయి. 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సువేందు అధికారి 81,230 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు హసీ రాణి రథ్ 1.22 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో ఆ రికార్డును అధిగమించారు.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు