Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- బెంగాల్లో సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ
- పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం సువేందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆధ్వర్యంలో తొలి కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం కోసం 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూములు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాకేంద్రీకృత పరిపాలన, భద్రత, సుపరిపాలన లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు.
సోమవారం నబన్నలో మంత్రులతో సువేందు అధికారి తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాక.. సువేందు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ చరిత్రలో తొలిసారి ఎలాంటి హింస, బెదిరింపులు లేకుండా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తామని, ఎన్నికల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఎప్పటికీ మర్చిపోమని తెలిపారు. వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
నిర్ణయాలు ఇవే..
కేబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణానికి 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూముల బదిలీ, ఐఏఎస్, ఐపీఎస్, డబ్ల్యూబీపీఎస్ అధికారులపై రాష్ట్రం వెలుపల డిప్యూటేషన్, శిక్షణ కార్యక్రమాల పరిమితుల ఎత్తివేత, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అవకాశం కోల్పోయిన అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)ను తక్షణ అమలు చేయడం, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన వంటి కేంద్ర పథకాల అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
‘‘45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూములు అప్పగిస్తాం. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది” అని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. రాష్ట్ర అధికారులకు బయటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా పరిపాలనా సమన్వయం, సంస్థాగత అనుభవం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ‘‘బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, ప్రజా అనుకూల పరిపాలన నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’’. అని సువేందు అధికారి స్పష్టం చేశారు.
మే 4న విడుదలైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఇక గత శనివారం ముఖ్యమంత్రిగాసువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటుదిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, ఖుదిరామ్ టుడు, నిశిత్ ప్రమాణిక్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?