Bengal’s Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..

  • మే 09 బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం..
  • మే 08న ముఖ్యమంత్రి ఎంపిక..
  • సువేందు అధికారికే సీఎంగా ఛాన్స్..?
Bjp

Bjp

Bengal’s Next CM: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయం దేశ రాజకీయ పరిస్థితుల్ని మార్చేస్తోంది. మొత్తం 294 సీట్లు గానూ బీజేపీ ఏకంగా 207 సీట్లను గెలుచుకుంది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరికన్నా ముందు వరసలో సువేందు అధికారి పేరు వినిస్తోంది. 2021, 2026లో వరసగా మమతా బెనర్జీని ఓడించి దిగ్గజాలను ఓడించిన వీరుడిగా పేరు తెచ్చుకున్నారు. దాదాపుగా ఈయనే సీఎం అవుతారనేది బలంగా వినిపిస్తున్న వాదన.

Read Also: Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..

ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై చర్చించేందుకు శుక్రవారం మే 8న కోల్‌కతాలో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే సువేందు అధికారిని తమ నాయకుడిగా ఎన్నుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, సువేందుకు పేరును ప్రతిపాదిస్తారని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆయన పేరును అధికారంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

సువేందు అధికారి, సమీక్ భట్టాచార్య, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆ తర్వాత రాజ్ భవన్ వెళ్లి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రమాణస్వీకారం మే 9న జరుగుతుందని భట్టాచార్య ధ్రువీకరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినోత్సవరం రోజునే బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌లో కొలువుతీరనుంది. ఈ ప్రమాణస్వీకార వేడుకకు ప్రధాని మోడీతో సహా, బీజేపీ ముఖ్యమంత్రులు, ఎన్డీయే ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలుస్తోంది.