Bengal’s Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
- మే 09 బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం..
- మే 08న ముఖ్యమంత్రి ఎంపిక..
- సువేందు అధికారికే సీఎంగా ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal’s Next CM: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయం దేశ రాజకీయ పరిస్థితుల్ని మార్చేస్తోంది. మొత్తం 294 సీట్లు గానూ బీజేపీ ఏకంగా 207 సీట్లను గెలుచుకుంది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరికన్నా ముందు వరసలో సువేందు అధికారి పేరు వినిస్తోంది. 2021, 2026లో వరసగా మమతా బెనర్జీని ఓడించి దిగ్గజాలను ఓడించిన వీరుడిగా పేరు తెచ్చుకున్నారు. దాదాపుగా ఈయనే సీఎం అవుతారనేది బలంగా వినిపిస్తున్న వాదన.
Read Also: Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై చర్చించేందుకు శుక్రవారం మే 8న కోల్‌కతాలో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే సువేందు అధికారిని తమ నాయకుడిగా ఎన్నుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, సువేందుకు పేరును ప్రతిపాదిస్తారని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆయన పేరును అధికారంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.
సువేందు అధికారి, సమీక్ భట్టాచార్య, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆ తర్వాత రాజ్ భవన్ వెళ్లి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రమాణస్వీకారం మే 9న జరుగుతుందని భట్టాచార్య ధ్రువీకరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినోత్సవరం రోజునే బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌లో కొలువుతీరనుంది. ఈ ప్రమాణస్వీకార వేడుకకు ప్రధాని మోడీతో సహా, బీజేపీ ముఖ్యమంత్రులు, ఎన్డీయే ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!