Site icon NTV Telugu

Hijab: “ఇక మీకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు”.. కర్ణాటకలో హిజాబ్‌పై బ్యాన్ ఎత్తివేత..

Hijab

Hijab

Hijab: గతేడాది కర్ణాటకలో హిజాబ్ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయ విమర్శలకు దారి తీసింది. పాఠశాల్లలో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై అప్పటి బీజేపీ సర్కార్ నిషేధం విధించింది. ఇదే అంశాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయబోతోంది. హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని త్వరలో ఉపసంహరించుకోనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సమర్థవంతమైన హిజాబ్ నిషేధం లేదని, మహిళలు తమకు కావలసినది ధరించవచ్చు అని అన్నారు.

REAF ALSO: Ivanka Trump: ఇజ్రాయిల్‌లో ట్రంప్ కూతురు.. అక్టోబర్ 7 బాధితులకు పరామర్శ..

‘‘ హిజాబ్‌పై నిషేధం ఇకపై లేదు. మహిళలు హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లొచ్చు. నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని నేను ఆదేశించాను. మీరు ఎలా దుస్తులు ధరించారు, ఏమి తింటారు అనేది మీ ఇష్టం. నేను మిమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి..?’’ అని మైసూర్‌లో జరిగిన ఓ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ చెబుతున్నట్లు ‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ అంతా బోగస్, బట్టలు, వేషం, కులం, మతం ఆధారంగా మనుషుల్ని విభజించాలని బీజేపీ చూస్తోందని, హిజాబ్‌పై నిషేధం ఎత్తివేయాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.

2022లో ముఖ్యమంత్రి బి బొమ్మై నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ని నిషేధించింది. ఈ వివాదం విద్యాలయాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ప్రభుత్వ నిర్ణయంపై ఓ వర్గం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో మతపరమైన ఆచారం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.ఆ తరువాత ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

Exit mobile version