NTV Telugu Site icon

Amit Shah: కాశ్మీర్‌లో శాంతి నెలకొంటే, పీఓకే ఆజాదీ నినాదాలతో దద్ధరిల్లుతోంది.

Amit Shah

Amit Shah

Amit Shah: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) రగులుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పీఓకే మద్దతు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమని, దానిని మేం తీసుకుంటామని అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఒకప్పుడు సమస్యాత్మక ప్రాంతంగా ఉండే జమ్మూ కాశ్మీర్‌లో శాంతి నెలకొంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మాత్రం ఇప్పుడు ఆజాదీ నినాదాలు, నిరసనలు ప్రతిధ్వనిస్తోందని పశ్చిమ బెంగాల్ సేరంపూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి షా అన్నారు. ఇప్పుడు పీఓకేలో ప్రజలు రాళ్లు రువ్వతున్నారని చెప్పారు.

Read Also: AP Elections 2024: ఫైనల్లీ ఏపీ పోలింగ్ శాతం చెప్పేశారు.. 2019 కంటే ఎంత పెరిగిందంటే?

ఇటీవల పీఓకేపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘మణిశంకర్ అయ్యర్ వంటి కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నందును పీఓకేని తీసుకోవద్దని చెప్పారు. అయితే, నేను పీఓకే భారత్‌లో భాగమే అని చెబుతున్నాను, దానిని భారత్ తిరిగి తీసుకుంటుంది’’ అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అవినీతి నాయకులు ఉన్న ఇండియా కూటమికి, నిజాయితీ కలిగిన నరేంద్రమోడీకి మధ్య జరుగుతున్నాయని, ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్న ఒక్క పైసా ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా అన్నారు.

చొరబాటుదారులు కావాలా..? లేక శరణార్ధులకు సీఏఏ కావాలా అనే దాన్ని బెంగాల్ నిర్ణయించుకోవాలని అన్నారు. జీహాద్‌కి ఓటేయాలా..? లేక వికాస్‌కి ఓటేయాలా..? అనే విషయాన్ని బెంగాల్ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఏఏని వ్యతిరేకించి తన ఓటు బ్యాంకుని ప్రసన్నం చేసుకోవాలని, చొరబాటుదారులకు మద్దతుగా ర్యాలీ చేపట్టిందని అమిత్ షా నిందించారు.