Gyanvapi Mosque case: “విజయం అంచున ఉన్నాం”.. జ్ఞానవాపి నివేదికపై హిందూ తరపు న్యాయవాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐఏ) సర్వే నివేదిక వచ్చిన తర్వాత.. తాము విజయానికి చేరువలో ఉన్నామంటూ హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం అన్నారు. ఏఎస్ఐ సర్వే నివేదిక వాజుఖానాలోని ఉన్నది శివలింగమా..? లేక ఫౌంటైనా.? అనేది తేలుస్తుందని ఆయన చెప్పారు. ‘‘వాజుఖనాలోని బావిలోని చేపలు చనిపోవడంతో వాటిని క్లీనింగ్ కోసం కోర్టులో దరఖాస్తు చేశాము. ఇక్కడ కూడా ఏఎస్ఐ సర్వే కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తు చేస్తాం. సర్వేపై స్టే తొలగించాలని కోరాము. ప్రస్తుతం దీని కస్టడీ వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ వద్ద ఉంది. ఏఎస్ఐ నివేదిక వచ్చిన తర్వాత మేము విజయం అంచున ఉంటామని నేను చెప్పగలను’’ అని ఆయన అన్నారు.
Read Also: Nani: బలగం వేణు దర్శకత్వంలో రెండో సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
జ్ఞాన్వాపి మసీదు అక్రమ ఆక్రమణ నుంచి విముక్తి పొందే రోజు మనం చూడగమని విష్ణు శంకర్ జైన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఏఎస్ఐ తన నివేదికను గురువారం బహిరంగపరచాలని హార్డ్ కాపీని ఇరు వర్గాలకు అందించాలని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాల తర్వాత హిందూ న్యాయవాది హరిశంకర్ జైన్ మాట్లాడుతూ.. ‘‘మసీదు నిర్మాణానికి మార్గం కల్పించడానికి మందిరాన్ని కూల్చివేసినట్లు చూపించడానికి ఆధారాలు ఉన్నాయి’’ అని వాదించారు. కోర్టులో వాదనల తర్వాత ఇరు పక్షాలు అంగీకరించడంతో నివేదిక బహిరంగపరచాలని కోర్టు ఆదేశించింది.
అంతకుముందు జనవరి 16న జ్ఞాన్వాపి మసీదులోని ‘వజుఖానా’లో శివలింగం ఉందని ఆరోపించబడుతున్న ప్రాంతాన్ని శుభ్రం చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 2022లో కోర్టు ఆదేశాల మేరకు మసీదులో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు. ఇందులో వాజూఖానా ప్రాంతంలోని ఓ కొలనులో శివలింగం వంటి ఆకారం బయటపడింది. హిందువులు దీనిని శివలింగం అని చెబుతుండగా.. మసీదు కమిటీ మాత్రం దీన్ని ‘ఫౌంటెన్’ అని చెబుతోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..