Russian President: భారత్‌లో పెద్ద మొత్తంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తెలిపారు. ప్రధాని మోడీ ఇచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాస్కోలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో చెప్పుకొచ్చారు. మోడీ ‘ఇండియా ఫస్ట్’ విధానంపై ఆయన ప్రశంసలు కురిపించారు. మేక్ ఇన్ ఇండియా నిర్ణయం ప్రపంచ దేశాల్లో భారత్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లిందో ఈ సందర్భంగా వెల్లడించారు. దేశాభివృద్ధికి మోడీ నిర్ణయాలు ఎలా దోహదం చేశాయో చెప్పారు.. ఆయనపై తనకున్న అభిమానాన్ని పుతిన్ చాటుకున్నారు.
Read Also: Eknath Shinde: డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే సొంత ప్రసంగం.. షాకైన మహాయుతి నేతలు
కాగా, మేక్ ఇన్ ఇండియా విధానం నన్ను ఎంతగానో ఆకర్షించిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. మనం కూడా భారత్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. మోడీ నేతృత్వంలో పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా మారిపోయిందన్నారు. ఆయన తీసుకొచ్చిన ఇండియా ఫస్ట్ విధానం వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం చాలా లాభదాయం.. అందుకే రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ భారత్‌లో ఇప్పటికే 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందని వ్లాదిమీర్ పుతిన్ వెల్లడించారు.
Read Also: Sukumar: రాజమౌళి’ భయపడినంతా అయ్యింది.. సరైనోడు తగిలాడు.. ‘సుకుమార్’ మెంటల్ మాస్!
ఇక, దేశాభివృద్ధి, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని భారతదేశ జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందని వ్లాదిమీర్ పుతిన్ చెప్పుకొచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులోనూ రష్యా అధ్యక్షుడు ఈ అంశాన్ని లేవనెత్తారు. MSMEల అభివృద్ధికి సపోర్టు ఇవ్వాలని బ్రిక్స్ సభ్య దేశాలను కోరారు. ఎంఎస్‌ఎంఈల స్థాపనకు ఏయే రంగాలు అనుకూలంగా ఉంటాయో గుర్తించాలన్నారు. దాంతో కీలక రంగాల్లో ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి.. దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుందని రష్యా అధినేత పుతిన్ పేర్కొన్నారు.