NTV Telugu Site icon

PM Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?

Modi, Putin

Modi, Putin

PM Modi: రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ విజయం సాధించారు. మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా ఉండేందుకు పుతిన్‌కి అవకాశం లభించింది. అయితే, బుధవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఇరువురు నేతలు, భారత్-రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Read Also: Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించి ఉండరు..

‘‘రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుతిన్ ఎన్నికైనందుకు అభినందనలు తెలిపాను. రాబోయే సంవత్సరాల్లో రష్యాతో భారతదేశ బంధాన్ని మరింత లోతుగా విస్తరించడానికి మేము కలిసి పనిచేయాలని అంగీకరించాము’’ అని పీఎం మోడీ ట్వీట్ చేశారు. అంతకుముందు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికైన తర్వాత ఎక్స్ వేదికగా ఆయన అభినందనలు తెలియజేశారు. భారతదేశం-రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు మోడీ చెప్పారు.

ఆదివారం జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ గెలుపొందారు. 87.17 శాతం ఓట్లను సాధించి పుతిన్ ఘనవిజయం సాధించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ 4.1 శాతం ఓట్లను సాధించి రెండో స్థానంలో ఉన్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో మరింత మెజారిటీ సాధించారు. 2018లో 76.69 శాతం ఓట్లు సాధించారు. పుతిన్ రష్యాకి నాలుగు పర్యాయాలుగా అధ్యక్షుడిగా పనిచేశారు. 2000, 2004, 2012, 2018లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.