Site icon NTV Telugu

Rahul Gandhi: వయనాడ్ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: భారత దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఇక, వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడం కోసం మంగళవారం రాత్రే తన సోదరితో పాటు వచ్చారు. ఈరోజు నియోజకవర్గంలోని కల్పెట్టలో ప్రియాంకతో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు.

Read Also: Zomato Platform Fee: పండగ వేళ జొమాటో కస్టమర్లకు షాక్.. ఇకనుంచి ఎక్కువ చెల్లించాల్సిందే!

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారు.. కానీ వయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉన్నారని రాహుల్‌ గాంధీ చెప్పుకొచ్చారు. ప్రియాంకా అధికారిక ఎంపీగా ఉంటే.. తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు. ఇద్దరం కలిసి వయనాడ్‌ అభివృద్ధికి తమ కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇక, ఈ ర్యాలీలో ప్రియాంకా గాంధీ, రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు సైతం పాల్గొన్నారు.

Exit mobile version