Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్‌మిలన్ ధరలు..
- ముంబైలో దారుణంగా పడిపోయిన పుచ్చకాయ ధరలు..
- ఫుడ్ పాయిజనింగ్ ఘటన తర్వాత తినడానికి జంకుతున్న ప్రజలు..
- రూ. 100 నుంచి రూ. 7కు పడిపోయిన ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Watermelon Prices:రెండు రోజుల క్రితం ముంబైలోని ఒక ఫ్యామిలీ వాటర్‌మిలన్ తిన్న తర్వాత మరణించడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా ముంబై వ్యాప్తంగా పుచ్చకాయ ధరలు, గిరాకీ పడిపోయింది. దీని కారణంగా నవీ ముంబై పండ్ల మార్కెట్లో ధర కిలోకు కేవలం రూ. 7కు పడిపోయింది. వేసవి కాలంలో విపరీతమైన ధరలు ఉండే వాటర్‌మిలన్ ధరలు ఒక్క సంఘటనలో దారుణంగా పడిపోయాయి. ఈ మార్కెట్లో కిలో పుచ్చకాయ ధర రూ. 5-7 మధ్య ఉంది. దీంతో వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూశారు. సాధారణంగా హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ. 10 నుంచి రూ. 35 మధ్య అమ్ముడవుతుంది. రిటైల్ మార్కెట్లో కిలోకు రూ. 30 నుంచి రూ. 100 మధ్య ఉంటుంది.
Read Also: West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్‌లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
రెండు రోజుల క్రితం దక్షిణ ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా (40), అతని భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13) శనివారం రాత్రి తమ ఇంట్లో పుచ్చకాయ ముక్కలు తిన్నారు. దీని తర్వాత వీరంతా తీవ్రమైన వాంతులు, విరేచనాలతో అవస్థ పడ్డారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే నలుగురూ మరణించారు. ఈ ఘటన తర్వాత ఫోరెన్సిక్ టీమ్ డొలాకియా నివాసంలో పుచ్చకాయ, నీరు, చికెన్ పలావ్ నమూనాలను పరీక్షల కోసం తీసుకెళ్లారు.
పోస్టుమార్టం తర్వాత నలుగురు ఫుడ్ పాయిజనింగ్ ద్వారా మరణించి ఉంటారని ప్రాథమిక నివేదిక నిర్ధారించింది. అయితే, పోలీసులు పలు విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.? ఆత్మహత్య చేసుకున్నా.? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బాధితులతో కలిసి విందులో పాల్గొన్న ఐదుగురు అతిథుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. తామంతా పులావ్ తిన్నామని తమకు వాంతులు, విరేచనాలు కాలేదని వారు చెప్పారు.
తాజావార్తలు
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్‌లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!