Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్‌మిలన్ ధరలు..

  • ముంబైలో దారుణంగా పడిపోయిన పుచ్చకాయ ధరలు..
  • ఫుడ్ పాయిజనింగ్ ఘటన తర్వాత తినడానికి జంకుతున్న ప్రజలు..
  • రూ. 100 నుంచి రూ. 7కు పడిపోయిన ధరలు..
Watermelon

Watermelon

Watermelon Prices:రెండు రోజుల క్రితం ముంబైలోని ఒక ఫ్యామిలీ వాటర్‌మిలన్ తిన్న తర్వాత మరణించడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా ముంబై వ్యాప్తంగా పుచ్చకాయ ధరలు, గిరాకీ పడిపోయింది. దీని కారణంగా నవీ ముంబై పండ్ల మార్కెట్‌లో ధర కిలోకు కేవలం రూ. 7కు పడిపోయింది. వేసవి కాలంలో విపరీతమైన ధరలు ఉండే వాటర్‌మిలన్ ధరలు ఒక్క సంఘటనలో దారుణంగా పడిపోయాయి. ఈ మార్కెట్‌లో కిలో పుచ్చకాయ ధర రూ. 5-7 మధ్య ఉంది. దీంతో వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూశారు. సాధారణంగా హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ. 10 నుంచి రూ. 35 మధ్య అమ్ముడవుతుంది. రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ. 30 నుంచి రూ. 100 మధ్య ఉంటుంది.

Read Also: West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..

×
×
Ad

రెండు రోజుల క్రితం దక్షిణ ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా (40), అతని భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13) శనివారం రాత్రి తమ ఇంట్లో పుచ్చకాయ ముక్కలు తిన్నారు. దీని తర్వాత వీరంతా తీవ్రమైన వాంతులు, విరేచనాలతో అవస్థ పడ్డారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే నలుగురూ మరణించారు. ఈ ఘటన తర్వాత ఫోరెన్సిక్ టీమ్ డొలాకియా నివాసంలో పుచ్చకాయ, నీరు, చికెన్ పలావ్ నమూనాలను పరీక్షల కోసం తీసుకెళ్లారు.

పోస్టుమార్టం తర్వాత నలుగురు ఫుడ్ పాయిజనింగ్ ద్వారా మరణించి ఉంటారని ప్రాథమిక నివేదిక నిర్ధారించింది. అయితే, పోలీసులు పలు విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.? ఆత్మహత్య చేసుకున్నా.? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బాధితులతో కలిసి విందులో పాల్గొన్న ఐదుగురు అతిథుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. తామంతా పులావ్ తిన్నామని తమకు వాంతులు, విరేచనాలు కాలేదని వారు చెప్పారు.