Putin: మరోసారి భారత్ టూర్‌కు పుతిన్.. ఎప్పుడంటే..!
- మరోసారి భారత్ టూర్‌కు పుతిన్
- నెలల వ్యవధిలోనే ఢిల్లీకి వస్తున్న రష్యా అధ్యక్షుడు
- మరింత బలపడనున్న రెండు దేశాల సంబంధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారత్‌కు రాబోతున్నారు. ఏడాదిలోనే రెండోసారి భారత్‌లో పర్యటించబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్‌లో జరిగే బ్రిక్స్ సమావేశానికి పుతిన్ హాజరుకాబోతున్నట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ వెల్లడించారు.
వచ్చే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు పుతిన్ హాజరవుతున్నారని దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక సహకార అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
- Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
ఇదిలా ఉంటే గత డిసెంబర్లో పుతిన్ భారత్‌లో పర్యటించారు. తిరిగి ఏడాదిలోపే భారత్‌కు రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో పుతిన్ జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు మళ్లీ కొన్ని నెలల వ్యవధిలోనే భారత్‌కు వస్తుండటం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు.. ఈ సంక్షోభ సమయంలో రెండు దేశాల మైత్రి మరింత బలం కానుంది.
President of Russia Vladimir Putin will attend the BRICS summit in New Delhi on September 12-13: Kremlin aide Yury Ushakov, tweets Russian Embassy in South Africa pic.twitter.com/sO4AGjbgIN
— ANI (@ANI) May 19, 2026
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?