Indian Students: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా, వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలు భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు ప్రతిబంధకంగా మారాయి. తాజాగా, ఇండియన్ స్టూడెంట్స్‌కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దు చేయవచ్చు’’ అని భారత విద్యార్థులకు అమెురికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికాలోని అనేక యూనివర్సిటీలు కూడా తమ విద్యార్థులను హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, అమెరికా సంస్థలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు “తరగతులను హాజరుకాకున్నా, చదువును మానేసినా లేదా సమాచారం లేకుండా తమ అకడమిక్ ప్రోగ్రాంని వదిలివేసినా” భవిష్యత్తులో వీసాలకు అర్హత కోల్పోయే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం మంగళవారం హెచ్చరించింది.
భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం విద్యార్థులు తమ వీసా నిబంధనలను ఎల్లప్పుడూ పాటించాలని మరియు ఏవైనా సమస్యలను నివారించడానికి వారి స్టూడెంట్ స్టేటస్‌ని కొనసాగించాలని ఎక్స్ లో కోరింది. ట్రంప్ పరిపాలన యూఎస్ అంతటా అంతర్జాతీయ విద్యార్థుల చట్టపరమైన స్థితిని రద్దు చేయకుండా కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి తాత్కాలికం నిరోధించిన కొన్ని రోజుల తర్వాత ఈ హెచ్చరిలకు వచ్చాయి.
