Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ఈ పరిణామాలు విజయ్ అభిమానుల్లో తీవ్ర భావోద్వేగాలకు దారితీస్తున్నాయి. శనివారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా రద్దు కావడంతో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో విజయ్‌కు మద్దతుగా ఉన్న ఓ అభిమాని ఆత్మాహుతికి యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సుమారు 40 ఏళ్ల వయసున్న ఇసక్కియప్పన్ అనే వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి కావడంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆవేదనతోనే ఈ చర్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఇదే వ్యక్తి గతంలో కూడా విజయ్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో తన ముఖానికి 16 అడుగుల పొడవైన ‘వేల్’ (ఈటె)ను గుచ్చుకున్నట్లు సమాచారం. దీంతో అతని తీవ్ర అభిమాన భావోద్వేగాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఈ సమయంలో శాంతి భద్రతలు కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. విజయ్ తన అభిమానులకు, కార్యకర్తలకు శాంతిని పాటించాలని, ఎలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని వెంటనే పిలుపునివ్వాలని తమిళిసై విజ్ఞప్తి చేశారు. రాజకీయ పరిస్థితులపై భావోద్వేగంతో స్పందిస్తున్న కార్యకర్తల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఇదిలా ఉండగా, వల్లియూర్ ప్రాంతంలో మరో యువకుడు కూడా ఆత్మాహుతికి యత్నించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే వీసీకే కార్యాలయం వెలుపల ఓ యువకుడిపై బ్లేడుతో దాడి జరిగిన ఘటన కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే, ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అభిమానుల భావోద్వేగాలు రాష్ట్ర రాజకీయాలను మరింత హీటెక్కుతున్నాయి..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!